దేశ రాజధానిలో ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. తల్లీకొడుకులను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దారుణంగా పొడిచి చంపారు. వివరాల్లోకి వెళితే.. వాయువ్య ఢిల్లీలోని జహంగీర్‌పురీ కె బ్లాక్‌లో మంగళవారం ఓ ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read:యువతిపై దూసుకెళ్లిన కారు.. స్నేహితులే అత్యాచారం చేసి..

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఆ ఇంటి తలుపులు బద్దలుకొట్టి చూడగా, మహిళ, ఓ బాలుడి మృతదేహాలు కనిపించాయి. ముందుగా వీరిద్దరినీ తీవ్రంగా కొట్టి, అనంతరం ఒక పదునైన ఆయుధంతో పొడిచి చంపి వుండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

Also Read:మసీదులో హిందూ పెళ్లి.. ఫోటోలు వైరల్

రెండు నుంచి మూడు రోజుల క్రితం ఈ హత్యలు జరిగి వుండొచ్చని వాయువ్య ఢిల్లీ పోలీస్ కమీషనర్ విజయాంత ఆర్య తెలిపారు. మృతులను పూజా 36, హర్షిత్‌ 12గా గుర్తించారు. ఆమె భర్త రెండేళ్ల క్రితం మరణించినట్లుగా తెలుస్తోంది. ఇరుగుపొరుగు వారి ద్వారా హత్యల విషయం తెలుసుకున్న పూజా తల్లి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా ఈ దారుణానికి పాల్పడింది ఎవరనేది ఇప్పటి వరకు తెలియరాలేదు.