lift cable snaps: గుమ్మిడిపూండి సమీపంలోని పెత్తికుప్పంలో శుక్రవారం సాయంత్రం కళ్యాణమండపంలోని లిఫ్టు కూలడంతో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. 

Tamil Nadu: పై అంత‌స్తుకు వెళ్తుండ‌గా, లిఫ్ట్ కేబుల్ వైర్ తెగిపోవ‌డంతో చోటుచేసుకున్న ప్ర‌మాదంలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. దీనిపై కేసు న‌మోదుచేసున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులో చోటుచేసుకుంది. 

పోలీసులు వెల్ల‌డించిన వివరాల ప్ర‌కారం.. గుమ్మిడిపూండిలోని కళ్యాణ మండపం వద్ద శుక్రవారం రాత్రి క్యాటరర్‌తో పార్ట్‌టైమ్‌గా పనిచేస్తున్న 19 ఏళ్ల పాఠశాల విద్యార్థి లిఫ్టు ప్రమాదంలో మృతి చెందాడు. కాంచీపురంలోని వాలాజాబాద్‌కు చెందిన శీతల్ 11 వ తరగతి చదువుతోంది. శుక్రవారం గుమ్మిడిపూండి సమీపంలోని పీఠికుప్పంలోని ఓ ప్రైవేట్ కళ్యాణమండపంలో క్యాటరర్లు పనికి వెళ్లారు. రాత్రి 8 గంటల సమయంలో, శీతల్ తో పాటు మ‌రో ఇద్ద‌రు సహచరులు తిరువ‌ణ్ణామ‌లైకి చెందిన జయరామన్,విఘ్నేష్ లు రెండవ అంతస్తుకు చేరుకోవడానికి గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న లిఫ్ట్ ను ఎక్కారు. 

అయితే, లిఫ్ట్ రెండో అంతస్తుకు చేరుకోగానే కేబుల్ వైర్ తెగిపోయి.. లిఫ్ట్ గ్రౌండ్‌ప్లోర్ నెల‌పై ప‌డింది. ఈ ప్ర‌మాదంలో శీతల్ తలపై బలమైన గాయాలయ్యాయి. మ‌రో ఇద్దరు గాయ‌ప‌డ్డారు. అయితే, శీతల్ త‌కు బ‌ల‌మైన గాయం కావ‌డంతో అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు వైద్యులు వెల్ల‌డించారు. అతని సహచరులు కూడా గాయపడి చికిత్స పొందుతున్నారు. దీనిపై పోలీసులు కేసు న‌మోదుచేసుకున్నారు. కళ్యాణ మండపం మేనేజర్, లిఫ్ట్ ఆపరేటర్, క్యాటరింగ్ కాంట్రాక్టర్ సహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ద‌ని తెలిపారు. 

ఇదిలావుండగా, పెళ్లి బృందం ప్రయాణిస్తున్న మినీ లారీ ఘోర రోడ్డుప్రమాదానికి గురయిన దుర్ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. లారీ మంచి వేగంతో దూసుకెళుతుండగా ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆనందోత్సాహాల మధ్య వివాహానికి హాజరయ్యేందుకు బయలుదేరిన వారిలో కొందరు ప్రాణాలనే కోల్పోగా మరికొందరు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ పాలయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నంద్యాల జిల్లా పాణ్యం మండలం కొండజూటూరు గ్రామానికి చెందిన పెళ్లిబృందం పాములపాడు మండలం చలిమెల గ్రామంలో జరిగే వివాహానికి బయలుదేరింది. అయితే వీరు ప్రయాణిస్తున్న మినీ లారీ పోలూరు గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. లారీ వేగంగా దూసుకువెళుతుండగా ఒక్కసారిగా గొర్రెల మంద అడ్డువచ్చింది. దీంతో డ్రైవర్ మందను తప్పించడానికి ప్రయత్నించగా లారీ అదుపుతప్పి బోల్తా పడింది. 

ఈ ప్రమాదంలో వెంకటయ్య(48) అక్కడిక్కడే మృతిచెందగా గజ్జెల ప్రసాద్ (65) తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ప్రమాదంలో మరో పదకొండుమంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు లారీ కింద చిక్కుకున్న క్షతగాత్రులను కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. గాయపడిన వారిని నంద్యాల పట్టణ శివారులోని శాంతిరాం హాస్పిటల్ కు తరలించారు. మరికొందరిని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అనంతరం ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాపప్తు చేపట్టారు. పెళ్లి బృందం లారీ ప్రమాదంగురించి తెలిసిన వెంటనే నంద్యాల ఇంచార్జి డీఎస్పీ రామాంజి నాయక్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అలాగే హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.