చెన్నై: తమిళనాడులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ప్రేయసి ఇంట్లో భోజనం చేసిన కొద్దిసేపటికే అతను మరణించాడు. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 17వ తేదీన వారిద్దరికి వివాహం జరగాల్సి ఉండింది. ఇంతలోనే ఆ విషాదకరమైన సంఘటన జరిగింది.

చెన్నై పల్లికరనైలోని నిశాంత్ అనే యువకుడు  ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న  అరియాలూరు జిల్లా గొంగైకొండచొళపురం ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించాడు. వారి ప్రేమకు ఇరు కుటుంబాలవాళ్లు ఆమోదం తెలిపారు దాంతో 17వ తేదీన వివాహం చేసేందుకు నిర్ణయం తీసుకున్నాడు. 

కరోనా వైరస్ కారణంగా నిషాంత్ పనిచేస్తున్న కార్యాలయానికి సెలవు ప్రకటించారు. దాంతో చెన్నై నుంచి ప్రేయసి ఇంటికి నిశాంత్ మంగళవారంనాడు వచ్చాడు. అతనికి చేపల పులుసు భోజనం వడ్డించారు .దాన్ని తిన్న కొద్దిసేపటికే అతనికి వాంతుల అయ్యాయి. 

వెంటనే అతన్ని అస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు నిశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.