మెరీనా బీచ్‌లో డీఎంకె చీఫ్ కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించే విషయంలో ప్రభుత్వం తీరును ఎండగట్టడంలో  డీఎంకె న్యాయవాది విల్సన్ కీలకపాత్ర పోషించారు.


చెన్నై: మెరీనా బీచ్‌లో డీఎంకె చీఫ్ కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించే విషయంలో ప్రభుత్వం తీరును ఎండగట్టడంలో డీఎంకె న్యాయవాది విల్సన్ కీలకపాత్ర పోషించారు. కరుణానిధి విల్సన్‌ను ఎప్పుడూ విన్ సన్‌వి అంటూ పిలిచేవారు. కరుణానిధి మాటలను ఆయన విల్సన్ నిజం చేశారు. కరుణానిధి అంత్యక్రియలను ఆయన కోరుకొన్న చోటునే నిర్వహించేలా కోర్టులో వాదించి ఈ కేసు గెలిచేలా చేశారు. కరుణానిధి మాటలను నిజం చేశారు.

మెరీనాబీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించడంపై సీఎం పళనిస్వామి అభ్యంతరం తెలిపారు. గాంధీ మండపం వద్ద కరుణానిధి అంత్యక్రియల కోసం రెండు ఎకరాలను కేటాయించనున్నట్టు ప్రకటించారు. అయితే దీనికి కరుణానిధి కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 

మంగళవారం రాత్రి డీఎంకె నేతలు మద్రాసు హైకోర్టులో అత్యవసర పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై డీఎంకె తరుపున ఆ పార్టీ న్యాయవాది విల్సన్ వాదించారు. ప్రభుత్వం తరుపున రాష్ట్ర అడ్వకేట్ జనరల్ విజయనారాయణరావు అందుబాటులో లేని కారణంగా సుప్రీంకోర్టు అడ్వకేట్ వైద్యనాథన్ వాదించారు. 

అయితే బుధవారం ఉదయం ఈ కేసు విచారణ సమయంలో మరోసారి ప్రభుత్వ తీరును అడ్వకేట్ విల్సన్ తూర్పారబట్టారు. ఏ కారణాలతో మెరీనాబీచ్ లో కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించాలనే విషయాన్ని ఆయన వాదించారు. దీంతో ఈ కేసులో డీఎంకెకు అనుకూలంగా తీర్పు వెలువడింది. 

మెరీనాబీచ్‌లోనే అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చని మద్రాసు హైకోర్టు స్పస్టం చేసింది. అయితే ఈ కేసులో డీఎంకె విజయం సాధించడంలో అడ్వకేట్ విల్సన్ కీలకంగా వ్యవహరించారు. గతంలో కరుణానిధి విల్సన్ ను ఎప్పుడూ నీవు విల్సన్ ను కావు విన్ సన్ వి అని పిలిచేవారు... విన్ సన్ వి అని కరుణానిధి ఎందుకు విల్సన్ ను పిలిచేవారో తెలియదు కానీ, కరుణానిధి అంత్యక్రియల కేసులో డీఎంకె విజయంలో విల్సన్ నిజంగా విన్‌సన్‌గా మారాడు.