ఓ జంట విడాకుల నేపథ్యంలో కేరళ హైకోర్టు షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ కాలం దంపతులు పెళ్లిని యూస్ అండ్ త్రో పద్దతిగా మార్చేశారంటూ కోర్టు సీరియస్ అవ్వడం గమనార్హం.
ఒకప్పుడు పెళ్లికి ఎక్కువ విలువ ఇచ్చేవారు. కష్టమొచ్చినా, కన్నీరు వచ్చినా ఆ బంధాన్ని తుంచుకోవాలని అనుకునేవారు కాదు. బంధానికి విలువనిచ్చి ముందుకు సాగేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద రాద్దాంతాలు చేసేస్తూ.. చీటికీ మాటికీ గొడవలు పడుతూ కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. చెప్పుకోవడానికి పెద్ద కారణం లేకపోయినా కూడా విడాకులు తీసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో కలిసి ఉండేవారికంటే కూడా విడిపోయేవారే ఎక్కువయ్యారు. ఈ నేపథ్యంలో ఓ జంట విడాకుల నేపథ్యంలో కేరళ హైకోర్టు షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ కాలం దంపతులు పెళ్లిని యూస్ అండ్ త్రో పద్దతిగా మార్చేశారంటూ కోర్టు సీరియస్ అవ్వడం గమనార్హం.
తొమ్మిది సంవత్సరాల క్రితం పెళ్లై.. ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తి.... మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో తన భార్య తనను వేధిస్తోందనంటూ విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించాడు. అయితే.. ఫ్యామిలీ కోర్టు అతని అప్పీల్ ని తిరస్కరించింది. దీంతో అతను విడాకుల కోసం హైకోర్టును ఆశ్రయించాడు.
ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎ.ముహమద్ ముస్తాకీ, జస్టిస్ సోఫీ థామ్‌సల ధర్మాసనం పరిశీలించింది. ఆ వ్యక్తి చేసిన వినతిని కొట్టి వేస్తూ కుటుంబ సంబంధాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ కాలం యువత పెళ్లిని గౌరవించడం లేదని కోర్టు భావించింది. కనీసం బాధ్యతగా ప్రవర్తించడం లేదని కోర్టు సీరియస్ అవ్వడం గమనార్హం. బాధ్యత, జవాబుదారీతనం లేకుండా స్వేచ్ఛ గా జీవించడానికి అదొక ఆటంకంగా పెళ్లిని భావిస్తున్నారని కోర్టు పేర్కొంది.
‘ వైఫ్- డబ్ల్యు ఐ వై ఎఫ్- అంటే ‘వర్రీ ఇన్‌వైటెడ్ ఫర్ ఎవర్’ అని అర్థం చెప్పుకొంటోంది. పాత అర్థమయితే ‘వైజ్ ఇన్వెస్టిమెంట్ ఫర్ ఎవర్’.ఎప్పుడు కావాలంటే అప్పుడు విడిపోవడానికి లివ్ ఇన్ రిలేషన్ ని ఎంచుకున్నారు. దేవుడికి నిలయమైన కేరళలో ఒకప్పుడు కుటుంబ విలువలు ఉండేవి. బంధాలు, అనుబంధలు ఉండేవి. ఇప్పుడు వివాహేతర సంబంధాలు పెట్టుకొని పిల్లల భవిష్యత్తు ఛిన్నాభిన్నం చేస్తున్నారు. వివాహం అనేది ఓ పవిత్ర బంధం. అంతేకానీ.. శారీరక వాంఛలు తీర్చుకోవడానికి ఇచ్చే ఒక లైసెన్స్ కాదు. పెళ్లిని యూస్ అండ్ త్రో లాగా చేస్తున్నారు’ అంటూ హైకోర్టు సీరియస్ అవ్వడం గమనార్హం.
