ఢిల్లీలోని బిందాపూర్ ప్రాంతంలో 25 ఏళ్ల రెజ్లర్ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మరణానికి కుటుంబ సమస్యలే కారణమంటూ సోషల్ మీడియాలో వీడియోను అప్‌లోడ్ చేశాడని పోలీసులు బుధవారం తెలిపారు.

ఢిల్లీ : ఢిల్లీలోని బిందాపూర్ ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది. 25 ఏళ్ల ఓ యువ Wrestler విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని ఆత్మహత్యకు కుటుంబ సమస్యలే కారణమంటూ మరణానికి ముందు సోషల్ మీడియాలో వీడియోను అప్‌లోడ్ చేశాడని పోలీసులు బుధవారం తెలిపారు.

మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో ఒక వ్యక్తి విషం సేవించినట్లు పోలీసులకు సమాచారం అందిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఘటన జరిగిన సమయంలో బాధితుడు తన అత్తమామల ఇంట్లో ఉన్నాడు. పోలీసులకు సమాచారం అందించిన వెంటనే.. అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ, ఆస్పత్రిలోనే మృతి చెందినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ద్వారక) ఎం హర్షవర్ధన్ తెలిపారు.

పదేళ్ల చిన్నారి దారుణహత్య, నోటికి టేప్ వేసి, మర్మాంగాలు కట్టేసి.. గోనెసంచిలో కుక్కి..

సెక్షన్ 174 సిఆర్‌పిసి కింద విచారణ జరుగుతుందని పోలీసుల తెలిపారు. విచారణలో భాగంగా ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన ఓ వీడియోను పోలీసులు గుర్తించారు. అందులో తన మరణానికి సంబంధించి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ వీడియోను పోలీసులు పరిశీలిస్తున్నారు. దీనిమీద ఓ అంచనా కోసం.. సంఘటన చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు.