రాజస్తాన్ లో 18యేళ్ల యువతిని కిడ్నాప్ చేసి, యాసిడ్ దాడి చేసి హత్య చేశారు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

జైపూర్ : రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు, ఆమె మీద యాసిడ్ దాడి చేశారు. ఆ తరువాత ఆమె మృతదేహం ఓ బావిలో దొరికింది. ఈ వివరాలను గురువారం పోలీసులు తెలిపారు. 

ఈ ఘటన రాజస్తాన్ లోని కరౌలీ జిల్లాలో వెలుగు చూసింది. 18 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి.. యాసిడ్ దాడి చేసి, హత్య చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. దీనిమీద కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. వీరికి ఎంపి కిరోడి లాల్ మీనా, ప్రతిపక్ష బిజెపి నాయకులు తోడయ్యారు. వీరు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉంచిన ఆసుపత్రి వెలుపల బైఠాయించారు.

నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని, బాధిత కుటుంబానికి రూ. 50 లక్షల రూపాయల పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. తోడభీం ప్రాంతానికి చెందిన మోహనపుర నివాసి అయిన మహిళ బుధవారం అదృశ్యమైనట్లు నడౌటి ఎస్‌హెచ్‌ఓ బాబు లాల్ తెలిపారు. 

"ఆమెను పాక్ కు పంపండి. లేదంటే.. మారణహోమానికి సిద్ధంగా ఉండండి" : ముంబై పోలీసులకు బెదిరింపులు

ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారని అధికారి తెలిపారు. బీజేపీ నాయకురాలు మీనా విలేకరులతో మాట్లాడుతూ.. మహిళను అపహరించి, అత్యాచారం చేసి చంపేశారని ఆరోపించారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 

ఇదిలా ఉండగా, కర్నూలు జిల్లా మంత్రాలయంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ యువతి మీద ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. దారుణంగా హత్య చేశారు. ఆ యువతిని కిడ్నాప చేసి, అత్యాచారం చేసిన అనంతరం హత్య చేశారని అనుమానిస్తున్నారు. తరువాత శవాన్ని చెట్టుకు వేలాడదీశాడు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. 

దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులు ఆమెను హత్య చేసిన తరువాతే చెట్టుకు ఉరివేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలిని బుడగజంగాల సామాజిన వర్గానికి చెందిన యువతిగా గుర్తించారు. నిందితుల్లో ఇధ్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు.