"నేననుకున్నది తప్పని మీరు నిరూపించారు" అని బిద్రీ క్రాఫ్ట్ ఆర్టిస్ట్ షా రషీద్ అహ్మద్ క్వాద్రీ ప్రధాని మోడీతో అన్నారు. ప్రతిష్టాత్మక పద్మా అవార్డుల కార్యక్రమంలో తనను అభినందించడానికి వచ్చిన మోడీతో ఆయన అన్నారు.
న్యూఢిల్లీ : బుధవారం రోజు సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కర్ణాటకకు చెందిన ప్రముఖ క్రాఫ్ట్ ఆర్టిస్ట్‌కు మధ్య జరిగిన హృద్యమైన సంభాషణ హైలైట్‌గా మారింది. "మీరు నన్ను తప్పుగా నిరూపించారు" అని బిద్రీ క్రాఫ్ట్ ఆర్టిస్ట్ షా రషీద్ అహ్మద్ క్వాద్రీ ప్రధాని మోదీతో అనడం వైరల్ అవుతోంది. ప్రతిష్టాత్మక పద్మా అవార్డుల పురస్కారం బుధవారం సాయంత్రం జరిగిన సంగతి తెలిసిందే. ఈ అవార్డు అందుకునే సమయంలో ప్రధాని మోడీ అభినందించడానికి తన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇలా అన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మశ్రీ అందుకున్న షా రషీద్ అహ్మద్ క్వాద్రీ, ప్రధానితో కరచాలనం చేస్తూ వీడియోలో కనిపించారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో తనకు పద్మ గౌరవం దక్కదని తాను నమ్ముతున్నానని అంతకు ముందు ఆయన చెప్పినట్లు తెలిసింది. ‘యూపీఏ ప్రభుత్వ హయాంలో పద్మ అవార్డు వస్తుందని ఆశించాను.. కానీ అది రాలేదు.. మీ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నాకు ఎలాంటి అవార్డు ఇవ్వదని అనుకున్నా.. కానీ మీరు నన్ను తప్పు అని నిరూపించారు. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను”అని అన్నారు క్వాద్రీ. దీనికి ప్రధానమంత్రి చిరునవ్వుతో నమస్కారించి ప్రతిస్పందించారు.
11 మంది బాలికలపై హెచ్ఎం లైంగిక వేధింపులు.. 10 ఏళ్ల కఠిన జైలు శిక్ష
పద్మ అవార్డులు మూడు విభాగాలలో ప్రదానం చేయబడతాయి. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న 2019 నుండి ఎవరికీ ఇవ్వలేదు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ములాయం సింగ్ యాదవ్, రచయిత్రి-పరోపకారి సుధా మూర్తి పద్మవిభూషణ్ అవార్డు పొందిన వారిలో ఉన్నారు.
బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్ భార్య, సుధా మూర్తి కుమార్తె అక్షత, రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఇతర ప్రముఖులతో పాటు ముందు వరుసలో కూర్చొని కనిపించారు. సుధా మూర్తి భర్త , ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి కూడా ఇతర అతిథులు, కుటుంబ సభ్యుల మధ్య కూర్చున్నారు. ఈ కార్యక్రమానికి అఖిలేష్ యాదవ్ కుటుంబం మొత్తం హాజరయ్యారు.
కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌర సేవ వంటి వివిధ విభాగాలు, కార్యకలాపాలలో ఈ అవార్డులు ఇవ్వబడతాయి.
పద్మవిభూషణ్, దేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారం, అసాధారణమైన, విశిష్ట సేవకు ఇవ్వబడుతుంది. ఉన్నత స్థాయి విశిష్ట సేవకు పద్మ భూషణ్. ఏ రంగంలోనైనా విశేష సేవలందించినందుకు పద్మశ్రీ ఇవ్వడం తెలిసిందే.
