ఒడిశాలో హెచ్ఎంగా ఉన్న కాలంలో ఓ దుండగుడు 11 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించాడు. కొన్ని సార్లు లైంగికదాడికి కూడా పాల్పడ్డాడు. ఈ కేసులో దోషికి సుందర్‌గడ్ పోక్సో కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. 

భువనేశ్వర్: ఒడిశాలో ఓ హెడ్‌మాస్టర్ 11 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 2015లో ఆయన హెడ్‌మాస్టర్‌గా ఉన్న కాలంలో ఈ వేధింపులు చేశాడు. ఒడిశాలోని సుందర్‌గడ్ జిల్లాలోని ఓ పోక్సో కోర్టు బుధవారం ఈ శిక్ష వేసింది. మాజీ హెచ్ఎంకు తాజాగా పోక్సో కోర్టు ఈ శిక్ష విధించింది.

లెహ్రిపారా బ్లాక్‌లోని స్కూల్‌లో హెడ్‌మాస్టర్‌గా వ్యవహరిస్తున్న కాలంలో 11 మంది బాలికలను వేధించాడు. 62 ఏళ్ల ఈ హెచ్ఎంను అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జీ మహేంద్ర కుమార్ సూత్రధార్ దోషిగా తేల్చారు. పదేళ్ల కఠిన కారాగార వాస శిక్ష విధించారు.

స్కూల్‌లో ఆ పిల్లలను వేధించడమే కాదు.. కొన్ని సార్లు స్కూల్‌లో వారు ఒంటరిగా కనిపించినప్పుడు రేప్‌నకూ పాల్పడ్డాడు.

2016 జూన్ 14వ తేదీన ఆయన అరెస్ట్ అయ్యాడు. అప్పటి నుంచి జైలులోనే ఉంటున్నారు.

Also Read: బండి అరెస్టుపై బీజేపీ అధిష్టానం సీరియస్! ఎండగట్టండి, అండగా ఉంటాం.. ‘ప్రధాని పర్యటన విఫలం చేయడానికే’

ఆ మాజీ హెచ్ఎంపై రూ. 47 వేల జరిమానా కూడా విధించింది. ఈ జరిమానా కట్టడంలో విఫలమైతే అదనంగా మరో ఆరు నెలలు జైలులో గడపాల్సి ఉంటుంది.