Yogi Adityanath: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నేతృత్వం వహించి పార్టీని గెలిపించిన యోగి ఆదిత్యనాథ్‌ ఈ నెల 25న రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లక్నోలోని ఏక్తా క్రికెట్‌ స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు.

Yogi Adityanath: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. దీంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ప్రమాణ స్వీకారం( Yogi oath ceremony) చేయ‌నున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం ఈ నెల 25న సాయంత్రం 4 గంటలకు ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్తా క్రికెట్‌ స్టేడియంలో జరిగే యోగి ప్రమాణ స్వీకార కార్యక్రమం(Yogi oath ceremony) ఉంటుందని తెలుస్తోంది. 45 వేల మంది సమక్షంలో ఈ కార్యక్రమం ఉంటుందని, దాదాపు 200 మంది VVIP లకు కూడా ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సీఎం యోగి( Yogi Adityanath)ప్రమాణస్వీకారాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ ప్లాన్ చేస్తోంది.అందుకు ఆహ్వానితుల జాబితాను సిద్ధం చేసింది. ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్ర నేతలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు యోగి ప్రమాణ స్వీకారానికి హాజరవుతారట‌. 

అలాగే.. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎంలను ప్ర‌త్యేకంగా ఆహ్వానించనున్నర‌ట‌. బీఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌, ఆయన కుమారుడు, ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ పేర్లు ప్ర‌త్యేక‌ ఆహ్వానితుల జాబితాలో ఉన్న‌ట్టు స‌మాచారం. అలాగే కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, యూపీ కాంగ్రెస్‌ ఇంచార్జీ ప్రియాంక గాంధీని కూడా యోగి ప్రమాణ స్వీకారానికి పిలువ‌నున్న‌ట్టు సమాచారం. అలాగే.. యోగి(Yogi Adityanath)తొలి ప్రభుత్వంలో పలు పథకాల ద్వారా లబ్ధిపొందిన వారిని కూడా ఈ కార్యక్రమానికి తరలిరానున్నర‌ట‌. 

ఈ త‌రుణంలో మరో ఆస‌క్తిక‌ర విష‌యం ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఈ సారి Yogi Adityanath త‌న కేబినెట్ లో యువ‌త‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని భావిస్తున్నార‌ట. ఈ క్ర‌మంలో 65 ఏళ్లు పైబ‌డిన వారికి యోగి కేబినెట్‌లో ఈసారి మంత్రి పదవులు దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ప్ర‌ధానంగా జాట్, పటేల్ వర్గాల వారికి మంత్రి పదవులు ఖాయమని ప్రచారం జరుగుతోంది.

ఉత్తరప్రదేశ్‌లోని 403 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగ‌గా.. ఈ నెల 10న ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌బ‌డ్డాయి. ఇందులో బీజేపీ ఘ‌న విజ‌యం సాధించింది. బీజేపీ 255 స్థానాల్లో, దాని మిత్ర ప‌క్షాలు18 స్థానాల్లో విజ‌యం సాధించ‌డంతో 273 సీట్ల మెజార్టీతో యూపీలో మరోసారి అధికారం చేపట్టనున్నది బీజేపీ. ఈ ఎన్నిక‌ల్లో అఖిలేష్ యాద‌వ్ గట్టి పోటీ ఇచ్చిన ఎస్పీ కి 111 సీట్లు, దాని మిత్రపక్షాలకు కేవ‌లం 14 సీట్లు గెలిచాయి. కాగా, తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన యోగి ఆదిత్యనాథ్‌ రెండోసారి సీఎం పదవిని చేపట్టి మరో రికార్డు సృష్టించనున్నారు. ఈ త‌రుణంలో అనేక రికార్డుల‌ను Yogi Adityanathబ్రేక్ చేశారు.