New Delhi: అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 100 రోజుల కౌంట్ డౌన్ ను పురస్కరించుకుని మూడు రోజుల యోగా మహోత్సవ్ ను ఉత్సాహంగా జరుపుకోవాలనీ, ఇప్పటివ‌ర‌కు యోగాను చేయ‌కుండా ఉన్నవారు నేటినుంచి యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. 

Yoga Mahotsav-Prime Minister Narendra Modi: యోగా మహోత్సవ్ లో దేశ ప్ర‌జ‌లంద‌రూ పాలుపంచుకోవాల‌ని ప్ర‌ధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 100 రోజుల కౌంట్ డౌన్ ను పురస్కరించుకుని మూడు రోజుల యోగా మహోత్సవ్ ను ఉత్సాహంగా జరుపుకోవాలనీ, ఇప్పటివ‌ర‌కు యోగాను చేయ‌కుండా ఉన్నవారు నేటినుంచి యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని ప్రధాని ప్రజలకు సూచించారు.

వివ‌రాల్లోకెళ్తే.. దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో మూడు రోజుల యోగా మహోత్సవ్ - 2023 జ‌ర‌గ‌నుంది. మార్చి 13,14 తేదీల్లో తల్కతోరా స్టేడియంలో ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుండ‌గా, మార్చి 15న న్యూఢిల్లీలోని మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగాలో జరగనుంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాని ప్ర‌జ‌లంద‌రూ యోగాను త‌మ జీవితంలో భాగం చేసుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

Scroll to load tweet…

యోగా మహోత్సవ్ పై కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ చేసిన ట్వీట్ ను షేర్ చేసిన ప్రధాని న‌రేంద్ర మోడీ.. 'యోగా దినోత్సవానికి వంద రోజులు మిగిలి ఉన్నందున, మీరంతా దీనిని ఉత్సాహంగా జరుపుకోవాలని కోరుతున్నాను. మీరు ఇప్పటికే యోగాను మీ జీవితంలో భాగం చేసుకోకపోతే, వీలైనంత త్వరగా యోగాను మీ జీవితంలో భాగం చేసుకోండి. యోగా మ‌హోత్స‌వ్ లో అంద‌రూ పాలుపంచుకోవాల‌ని కోరుతున్నాను" అని పేర్కొన్నారు. కాగా, 2014లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ప్రారంభమైన తర్వాత 2015 నుంచి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జ‌రుపుకుంటున్నారు.

Scroll to load tweet…