యడ్యూరప్పకు కలిసొచ్చిన బంగ్లా..నో చెప్పిన స్వామి.. మళ్లీ సీఎం అవుతారనా..?

yeddyurappa rejects official house
Highlights

యడ్యూరప్పకు కలిసొచ్చిన బంగ్లా..నో చెప్పిన స్వామి.. మళ్లీ సీఎం అవుతారనా..?


వాస్తు, జ్యోతిష్యం నమ్మే వారికి మన సమాజంలో కొదవలేదు.. మూహుర్తం చూడనిదే అడుగు కూడా ముందుకు వేయని వారు ఎందరో వున్నారు. ఈ లిస్ట్‌లో సామాన్యులే కాదు.. ప్రభుత్వాధినేతలు, రాజకీయనేతలు కూడా ఉన్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యడ్యూరప్పకు కూడా వాస్తు మీద నమ్మకం ఎక్కువే. ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తున్న యడ్డీ తనకు ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను నిరాకరించారు.

దీని వెనుక పెద్ద కారణమే ఉంది... మంత్రివర్గం కొలువుదీరిన తర్వాత అందరికి ప్రభుత్వ బంగ్లాల కేటాయింపులు చేశారు.. దీనిలో భాగంగా ప్రతిపక్షనేత యడ్యూరప్పకు బెంగళూరు రేస్ కోర్స్ రోడ్డులోని బంగ్లా నంబర్ 4ను కేటాయించారు. అయితే యడ్యూరప్ప సీఎంగా ఉన్న సమయంలో బంగ్లా నంబర్ 2లో ఉండేవారు.. అది ఆయనకు సెంటిమెంట్.. ఆ సమయంలో సదరు భవనానికి వాస్తుపరంగా ఎన్నో మార్పులు చేయించారు యడ్డీ. ఇప్పుడు కూడా తనకు అదే భవనం కావాలని ప్రభుత్వాన్ని కోరారు..

అయితే బంగ్లా నెంబర్ 4ను కేటాయించడం పట్ల యడ్యూరప్ప అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను నిరాకరించి.. తన సొంత ఇంట్లోనే ఉంటానని స్పష్టం చేశారు.. అయితే వాస్తు కారణంగానే యడ్యూరప్పకు బంగ్లా నెంబర్ 2 ఇవ్వలేదని.. ముఖ్యమంత్రి  కుమారస్వామి తండ్రి దేవేగౌడ వాస్తును బాగా నమ్ముతారని... సదరు బంగ్లాను యడ్డీకి కేటాయిస్తే.. మళ్లీ ఆయన సీఎం అవుతారేమోనన్న భయంతోనే కావాలని ఆ బంగ్లాను ప్రభుత్వం కేటాయించలేదని కర్ణాటక బీజేపీ వర్గాలు చెవులు కోరుక్కుంటున్నాయి. 

loader