వన్ ప్లస్6 రికార్డులను బ్రేక్ చేసిన ఎంఐ8

Xiaomi’s Mi 8 breaks OnePlus 6 record, sells 1 million units in just 18 days
Highlights


పదిలక్షల యూనిట్ల అమ్మకాలు

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి ఇటీవల విడుదల చేసిన ఎంఐ ఫోన్ రికార్డులు బద్దలు కొడుతోంది. కొద్ది రోజుల క్రితం వన్ ప్లస్ 6 విడుదలైన 22 రోజులకే పదిలక్షల యూనిట్లు అమ్ముడై రికార్డు సృష్టించగా.. దాని రికార్డుని ఎంఐ8 బ్రేక్ చేసింది. 

వన్ ప్లస్ 6కి 22 రోజుల సమయం పట్టగా.. ఆ రికార్డుని బ్రేక్ చేయడానికి ఎంఐ8కి కేవలం 18 రోజులే పట్టడం గమనార్హం.  జూన్‌ 5న తొలిసారి షావోమి ఎంఐ 8 స్మార్ట్‌ఫోన్‌ను విక్రయానికి తీసుకొచ్చింది. ఎంఐ 8 స్మార్ట్‌ఫోన్‌ 10 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదు చేసిందన్న విషయాన్ని కంపెనీ గ్లోబల్‌ అధికార ప్రతినిధి డోనోవాన్‌ సంగ్‌ ట్విటర్‌ ద్వారా ధృవీకరించారు. 

‘జూన్‌ 5న ఎంఐ 8 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ తొలిసారి విక్రయానికి వచ్చింది. కేవలం 18 రోజుల్లోనే మేము 10 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదు చేశాం’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. 

షియోమి ఎంఐ8 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు...

6.21 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ అమోలెడ్‌ నాచ్డ్‌ డిస్‌ప్లేను ఇది కలిగి ఉంది
2.5 కర్వ్‌డ్‌ గ్లాస్‌తో గ్లాస్‌, మెటల్‌ డిజైన్‌తో రూపొందింది
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 845 ప్రాసెసర్‌
6 జీబీ ర్యామ్‌
64 జీబీ, 128 జీబీ, 256 జీబీ వేరియంట్లలో లభ్యం
12 ఎంపీ + 12 ఎంపీ డ్యూయల్‌ రియర్‌ కెమెరాలు
20 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
3400 ఎంఏహెచ్‌ బ్యాటరీ

loader