Asianet News TeluguAsianet News Telugu

విషాదం... ప్రముఖ రచయిత్రి వాణీమోహన్ కన్నుమూత

ప్రముఖ రచయిత్రి వాణీ మోహన్ అనారోగ్యంతో శనివారం కన్నుమూసారు. చెన్నైలోని స్వగృహంలో ఆమె మృతిచెందారు. 

writer vani mohan passed away at chennai
Author
Chennai, First Published Nov 14, 2021, 9:44 AM IST

చెన్నై: ప్రముఖ తెలుగు రచయిత్రి వాణీ మోహన్(80) హఠాన్మరణం చెందారు. చలిజ్వరంతో బాధపడుతున్న ఆమె రక్తంలో  చక్కెర శాతం పడిపోవడంతో ఆరోగ్యపరిస్థితి పూర్తిగా క్షీణించి మృతిచెందారు. చెన్నైలోని స్వగృహంలో వాణీమోహన్ మృతదేహాన్ని వుంచిన కుటుంబసభ్యులు అక్కడే అంత్యక్రియలు చేపట్టనున్నారు. 

vani mohan భర్త ఇప్పటికే మరణించగా కొడుకు అమెరికాలో వుంటున్నాడు. తల్లి మరణవార్త అతడికి అందించినట్లు... ఆదివారం అతడు చెన్నైకి చేరుకోనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సోమవారం వాణీమోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.  

వాణీమోహన్  భర్త మోహన్‌ రైల్వే ఉన్నతాధికారిగా పనిచేస్తూ ఉత్తరాది రాష్ట్రాల్లో విధులు నిర్వహించేవారు. ఈక్రమంలోనే భర్తతో కలిసి వివిధ రాష్ట్రాల్లో నివాసమున్న ఆమె ఆయా ప్రాంతాల్లోని ప్రత్యేకతలు, సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకునేవారు. ఆ వివరాలను భర్తతో కలిసి గ్రంధస్తం చేసారు.

read  more  ప్రమాదవశాత్తూ బాంబు పేలి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి.. ఏడాదిన్నర తర్వాత ప్రకటన..!

చెన్నైలో స్థిరపడిన తర్వాత వాణీమోహన్  రచనలపై మరింత ఆసక్తి చూపించారు. ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ స్పూర్తితో రచయితగా మారిన వాణి అనేక కథలు, కవితలు రచించారు. ఇవి వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.  

వాణిమోహన్ మృతిపై పలువురు రచయితలు తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆమె మరణం రచనా లోకానికి తీరని లోటని పేర్కొన్నారు. మంచి రచయితగా తెలుగు సాహిత్యానికి వాణీమోహన్ విశేషమైన సేవలందించారని పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios