వావ్.. కాశ్మీర్ హిమపాతాన్ని రిపోర్టింగ్ చేసిన చిన్నారులు.. ఆనంద్ మహీంద్ర ఫిదా.. వైరల్
కాశ్మీర్ హిమపాతాన్ని ఇద్దరు చిన్నారులు రిపోర్టింగ్ (Two children reporting on Kashmir snowfall) చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా (video viral) మారింది. దీనిని చూసి ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర (Anand Mahindra)కూడా ఫిదా అయ్యారు. ఆ వీడియోను ఆయన కూడా తన ‘ఎక్స్’ (ట్విట్టర్)లో షేర్ చేశారు.
ఇద్దరు చిన్నారులు కాశ్మీర్ హిమపాతాన్ని రిపోర్టింగ్ చేశారు. చిన్నారులు ఎంత క్యూట్ గా ఉన్నారో వాళ్లు చెప్పే మాటలు కూడా అంతే క్యూట్ గా ఉన్నాయి. ఈ వీడియోను చూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా అబ్బుర పడ్డారు. దీంతో ఆ వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కాశీ, మథురలకు విముక్తి లభిస్తే.. ఇతర ఆలయాల వివాదాలకూ పరిష్కారం - గోవింద్ దేవ్ గిరి మహరాజ్
ఈ వీడియోలో మంచు కురుస్తుండగా.. బయట నిలబడి ఇద్దరు చిన్నారులు దానిని వివరిస్తున్నారు. టీవీల్లో ప్రొఫెషనల్ రిపోర్టర్లు చెప్పిన విధంగా అక్కడ ఉన్న పరిస్థితులను రిపోర్టింగ్ చేస్తున్నారు. వీడియో తీసిన ఆ చిన్నారుల తల్లి మాటలు కూడా వినిపిస్తున్నాయి.
కాగా.. ఈ వీడియోను ఆనంద్ మహీంద్ర షేర్ చేస్తూ.. ‘‘ఈ వీడియోలో అమ్మాయిలు మంచుపై నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. దాన్ని స్వర్గంతో కూడా పోలుస్తున్నారు’’ అని క్యాప్షన్ పెట్టారు. ఆయన పోస్టుకు యూజర్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఓ యూజర్ ‘‘చిన్నారుల ముఖ కవళికలు కూడా చాలా అందంగా ఉన్నాయి... అందమైన అక్కాచెల్లెళ్లు’’ అని వ్యాఖ్యానించగా.. మరొకరు ‘‘ఎంత అందమైన వీడియో. దానిని చూసి ఆనందించాను.’’ అని పేర్కొనగా.. మరొకరు ‘‘నేను ఈ రోజు ఇంటర్నెట్‌లో చూసిన ఉత్తమమైన విషయం’’ అని కామెంట్ చేశారు.
మోడీ ఓబీసీ కాబట్టే శంకరాచార్యులు అయోధ్యకు రాలేదు - ఉదయనిధి స్టాలిన్
వాస్తవానికి ఈ వీడియో ఫిబ్రవరి 4న షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి వేల సంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయి. దీనికి 38.12 లక్షలకు పైగా వ్యూస్, 11 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు