కాశీ, మథురలకు విముక్తి లభిస్తే.. ఇతర ఆలయాల వివాదాలకూ పరిష్కారం - గోవింద్ దేవ్ గిరి మహరాజ్
కాశీ, మథుర ఆలయాలకు విముక్తి లభిస్తే దేశంలో ఉన్న మిగితా ఆలయాల వివాదాలు కూడా పరిష్కారం అవుతాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర కోశాధికారి గోవింద్ దేవ్ గిరి మహారాజ్ అన్నారు. కాశీ, మథురలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ముస్లిం సమాజం మద్దతు ఇవ్వాలని కోరారు.
కాశీ, మథురలు శాంతియుతంగా తిరిగి స్వాధీనం చేసుకుంటే.. విదేశీయుల చేతిలో ఆక్రమణకు గురైన ఇతర దేవాలయాల సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుందని, హిందూ సమాజం వాటిపై దృష్టి మళ్లిస్తుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర కోశాధికారి గోవింద్ దేవ్ గిరి మహారాజ్ అన్నారు. ఆయన 75వ జన్మదిన వేడుకల సందర్భంగా పుణె శివార్లలోని అలండిలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.
టీఎస్ పీఎస్సీలో కీలక మార్పు.. కొత్త సెక్రటరీగా నవీన్ నికోలస్
ఈ సందర్భంగా గోవింద్ దేవ్ గిరి మహారాజ్ మీడియాతో మాట్లాడారు. విదేశీ దాడుల్లో సుమారు 3,500 హిందూ దేవాలయాలను కూల్చివేతకు గురయ్యారని అన్నారు. ఈ మూడు దేవాలయాలకు విముక్తి కల్పిస్తే ఇతర దేవాలయాల వైపు చూడాల్సిన అవసరం లేదని తెలిపారు. మిగితా దేవాలయాల సమస్యలు సునాయాసంగా పరిష్కారం అవుతాయని చెప్పారు.
టీఎస్ నుంచి టీజీగా మార్చడానికి కారణం అదే - మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కాశీ, మథురలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ముస్లిం సమాజం మద్దతు ఇవ్వాలని కోరారు. ‘‘మేము (రామ మందిరానికి) శాంతియుత పరిష్కారాన్ని కనుగొన్నాం. ఇప్పుడు అలాంటి శకం ప్రారంభమైనందున, ఇతర సమస్యలు కూడా శాంతియుతంగా పరిష్కారం అవుతాయని అన్నారు.’’ అని తెలిపారు. కాశీ, మథురలకు సంబంధించి శాంతియుత పరిష్కారానికి ముస్లిం సమాజంలో చాలా మంది సిద్ధంగా ఉన్నారని గోవింద్ దేవ్ గిరి మహరాజ్ తెలిపారు. అయితే కొంత వ్యతిరేకత కూడా ఉందని చెప్పారు.