Password: మీ పాస్‌వర్డ్‌ను సెకన్లలో హ్యాక్ చేయొచ్చు.. ఇదే చాలా కామన్ పాస్‌వర్డ్
డిజిటల్ వరల్డ్‌లో మన వ్యక్తిగత వివరాలకు, సున్నితమైన సమాచారానికి గోప్యత చాలా అవసరం. అది పాస్‌వర్డ్‌లతో సాధ్యం అవుతుంది. మన దేశంలో ఈ పాస్‌వర్డ్‌లను చాలా ఈజీగా పెట్టుకుంటున్నారు. ‘123456’ ఈ పాస్‌వర్డ్ ప్రపంచంలోనే వరెస్ట్ పాస్‌వర్డ్ అని, దీన్ని సెకన్ల వ్యవధిలోనే హ్యాక్ చేయవచ్చని ఓ స్టడీ తెలిపింది.
న్యూఢిల్లీ: డిజిటల్ వరల్డ్‌లో మనం నిర్లక్ష్యంగా ఉంటే సైబర్ మోసగాళ్లు సులువుగా చెలరేగిపోతారు. నేడు ప్రతీది నెట్‌తో ముడిపడి ఉన్నది. ఎంటర్‌టైన్‌మెంట్ మొదలుకుని ఆర్థిక లావాదేవీల వరకు ఇప్పుడంతా డిజిటల్. ప్రతిదానికీ ఒక అకౌంట్. ఆ అకౌంట్‌కు పాస్‌వర్డ్. దీంతో మనం ఒకేసారి ఒక్కో అవసరానికి ఒక్కో అకౌంట్ కలిగి ఉంటాం. ఈ అకౌంట్‌ల పాస్‌వర్డ్‌లు మరిచిపోవడమూ జరుగుతుంటుంది. అందుకే చాలా సులువైన పాస్‌వర్డ్‌లు పెడుతుంటాం. లేదంటే.. ఒకే పాస్‌వర్డ్‌ను ఒకటికి మించి అకౌంట్‌లకు యూజ్ చేస్తుంటాం. ఇది చాలా ప్రమాదకరం అని, బలమైన పాస్‌వర్డ్ అత్యావశ్యకం అని నార్డ్‌పాస్ ఇటీవలే ఓ అధ్యయనంలో పేర్కొంది. మన దేశంలోని చాలా మంది పాస్‌వర్డ్‌లను సింపుల్‌గా, ఈజీగా పెట్టుకుంటున్నారని హెచ్చరించింది. అలాంటి ఖాతాలను సెకన్ల వ్యవధిలోనే హ్యాక్ చేసే ముప్పు ఉన్నదని తెలిపింది.
చాలా కామన్‌గా యూజ్ చేసే పాస్‌వర్డ్ ‘123456’ అని ఈ అధ్యయనం తెలిపింది. ఈ పాస్‌వర్డ్‌ను క్షణాల్లో బ్రేక్ చేయవచ్చని పేర్కొంది. ఈ పాస్‌వర్డ్‌ను మొత్తంగా 45 లక్షల అకౌంట్‌లకు యూజ్ చేస్తున్నారని చెప్పింది. దీని తర్వాతి స్థానాల్లో ‘admin’, ‘12345678’ అనే పాస్‌వర్డ్‌లు ఉంటాయి. వీటిని వరుసగా 40 లక్షలు, 13.7 లక్షల ఖాతాలకు వినియోగిస్తున్నారు.
Also Read: Karimnagar: బండి సంజయ్ మూడోసారి ఓటమి నుంచి తప్పించుకుంటాడా?
ఇక భారత్ విషయానికి వస్తే మన దేశంలో ‘123456’ పాస్‌వర్డ్‌ను 3.6 లక్షల ఖాతాలు, ‘admin’ అనే పాస్‌వర్డ్‌ను 1.2 లక్షల ఖాతాలకు ఉపయోగిస్తున్నారు. ఇందులోనూ ముఖ్యంగా ఓటీటీ వంటి స్ట్రీమింగ్ సర్వీస్‌లకు చాలా వరస్ట్ పాస్‌వర్డ్‌లు ఇస్తున్నట్టు ఈ అధ్యయనం తెలిపింది. బ్యాంకింగ్ సేవలకు మాత్రం కొంత బలమైన పాస్‌వర్డ్‌లనే ఉపయోగిస్తున్నారట.
ప్రపంచంలోనే అత్యంత చెత్త పాస్‌వర్డ్ ‘123456’ అని ఈ స్టడీ స్పష్టం చేసింది. ప్రతి ఐదు పాస్‌వర్డ్‌లలో నాలుగు ఇవే ఉంటున్నాయని తెలిపింది. ఇక పాస్‌వర్డ్(Password)నే పాస్‌వర్డ్‌గా పెట్టుకుంటున్నారట. ఇది కూడా హ్యాకర్లకు చాలా సులువైన పాస్‌వర్డ్ అని స్టడీ వెల్లడించింది.