Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచ జనాభా 800 కోట్లు.. వచ్చే ఏడాది వరకు భారత్ టాప్.. క్రమంగా పెరుగుతున్న ఆయుఃప్రమాణం 

నవంబర్‌ 15, 2022 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోనున్నట్టు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ‘వరల్డ్‌ పాపులేషన్‌ ప్రాస్పెక్ట్స్‌-2022’ నివేదికను ఇటీవల ఐక్యరాజ్యసమితి  విడుదల చేసింది. ఆ నివేదికలో జనాభా పెరుగుదల, జనాభా సాంద్రత రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో పేర్కొన్నది.  

World Population To Hit 8 Billion Today UN Report
Author
First Published Nov 15, 2022, 11:07 AM IST

ప్రపంచ జనాభాపై యూఎన్ నివేదిక: ప్రపంచ జనాభా మంగళవారం (నవంబర్ 15) రికార్డు స్థాయికి చేరుకుంటుంది. మంగళవారం నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. 2030 నాటికి ప్రపంచ జనాభా 850 కోట్లకు చేరుకుంటుందనీ, అలాగే 2050 నాటికి 970 కోట్లకు,2100 నాటికి 1040 కోట్లకు చేరుకుంటుందని అంచనా.

ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ‘వరల్డ్‌ పాపులేషన్‌ ప్రాస్పెక్ట్స్‌-2022’ లో పలు ఆస్తకికర విషయాలను వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచ సగటు ఆయుఃప్రమాణం 72.8 ఏండ్లుగా ఉంది. 1990తో పోలిస్తే.. ఆయుర్దాయం 9 ఏండ్లు పెరిగింది. అదే సమయంలో..2050 నాటికి ప్రపంచ సగటు ఆయుఃప్రమాణం  77.2 ఏండ్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. పురుషుల కంటే మహిళలు సగటున 5.4 ఏళ్లు ఎక్కువగా జీవిస్తున్నారని నివేదికలో పేర్కొంది. స్త్రీల సగటు ఆయుఃప్రమాణం 73.4 ఏండ్లు కాగా.. పురుషుల ఆయుఃప్రమాణం 68.4 ఏండ్లుగా అంచనా వేయబడింది.

ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ఈ వార్షిక వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ నివేదిక కూడా ప్రపంచ జనాభా 1950 నుండి నెమ్మదిగా పెరుగుతోందని, 2020లో ఒక శాతం కంటే తక్కువకు పడిపోతుందని పేర్కొంది. ప్రపంచ జనాభా 700 కోట్ల నుంచి 800 కోట్లకు పెరగడానికి 12 సంవత్సరాలు పట్టిందనీ, కానీ, 2037 నాటికే ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది.

2023 నాటికి చైనాను అధిగమించనున్న భారత్ 

జనాభా పెరుగుదలలో భారతదేశం 2023 నాటికి చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరిస్తుంది. 2023 నాటికి చైనాను వెనక్కి నెట్టి భారతదేశం అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించనుందని నివేదికలో పేర్కొన్నారు. అదే సమయంలో నివేదికలో ప్రపంచ జనాభా 2080 నాటికి 1040 కోట్లకు చేరుతుందని అంచనా వేయబడింది.

ప్రపంచ జనాభాలో సగం జనాభా ఈ దేశాల్లోనే  

వచ్చే 27 ఏళ్లలో ప్రపంచ జనాభాలో సగం జనాభా 8 దేశాల్లో నివసిస్తున్నారని వార్షిక వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్ పేర్కొంది. అంటే ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే ఈ ఎనిమిది దేశాల జనాభా అత్యధికంగా ఉంటుంది. 2050 నాటికి భారత్, పాకిస్థాన్, కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, నైజీరియా, ఫిలిప్పీన్స్, టాంజానియా దేశాల జనాభాజ..  ప్రపంచ జనాభాలో 50 శాతంగా ఉంటాయని నివేదిక పేర్కొంది. అంటే రానున్న కొద్ది సంవత్సరాల్లో ఈ ఎనిమిది దేశాలు అత్యధిక జనాభా సాంద్రతను కలిగి ఉండబోతున్నాయి.

పాకిస్థాన్ ను వీడుతున్న పౌరులు  

2010 నుంచి 2021 మధ్య కాలంలో అత్యధిక సంఖ్యలో పాకిస్థాన్ పౌరులు దేశం విడిచి ఇతర దేశాల్లో నివాసం ఏర్పరుచుకున్నారని నివేదికలో పేర్కొంది. యూఎన్ నివేదిక ప్రకారం.. 2010 నుంచి 2021 మధ్య కాలంలో దాదాపు 1.65 కోట్ల మంది పాకిస్థానీయులు తమ దేశాన్ని విడిచిపెట్టి ఇతర దేశాల పౌరసత్వం తీసుకున్నారని సంచలన విషయాన్ని వెల్లడించారు. ఈ జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంది. 35 లక్షల మంది దేశం విడిచి ఇతర దేశాల్లో స్థిరపడ్డారని తెలిపింది. దీని తరువాత బంగ్లాదేశ్ నుండి 29 లక్షల మంది, నేపాల్ నుండి 16 లక్షలు, శ్రీలంక నుండి 10 లక్షల మంది పౌరులు తమ దేశాన్ని విడిచి వేరే దేశ పౌరసత్వం పొందారని నివేదిక వెల్లడించింది.

Follow Us:
Download App:
  • android
  • ios