ప్రపంచంలో కెల్లా ఖరీదైన చీజ్ గురించి విన్నారా? దీని ధర వింటే ఎవరైనా షాకైపోవాల్సిందే.  

చీజ్ ని ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. చీజ్ ని మనం చాలా రకాల వంటల్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా పాస్తాల్లో, బర్గర్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే, చీజ్ ధర ఎంత ఉంటుంది..? మహా అయితే రూ.వంద లేదంటే రూ.రెండొందలు ఉంటుంది. కానీ, ప్రపంచంలో కెల్లా ఖరీదైన చీజ్ గురించి విన్నారా? దీని ధర వింటే ఎవరైనా షాకైపోవాల్సిందే. 

స్పెయిన్ లో తాజాగా ఓ చీజ్ ని అమ్మారు. దాదాపు 30వేల యూరోలకు అమ్మారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.27లక్షలు కావడం విశేషం. ఇది మామూలు చీజ్ కాదు. దీనిని కాబ్రెల్స్ బ్లూ చీజ్. కాగా, ప్రపంచంలో కెల్లా ఎక్కువ ఖరీదైన చీజ్ గా ఇది రికార్డు క్రియేట్ చేసింది. మొత్తం చీజ్ 2.2కేజీలు కావడం విశేషం. 2019లో ఇలాంటి చీజ్ ఓ రికార్డు క్రియేట్ అవ్వగా, ఇప్పుడు దానిని మళ్లీ ఇదే చీజ్ రికార్డు బ్రేక్ చేయడం విశేషం. ఇంత ఖరీదైన చీజ్ ప్రస్తుతం స్పెయిన్ లో మాత్రమే అందుబాటులో ఉంది.

దీనీ తయారు చేసే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. 7డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద దీనిని తయారు చేస్తారు. అదేవిధంగా దీని తయారీకి దాదాపు 8 నెలల సమయం పడుతుందట. అందుకే అంత స్పెషల్.