వాజ్ పేయికి ప్రపంచ నేతల నివాళి

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 17, Aug 2018, 12:29 PM IST
World Leaders Pay Tribute To Former pm atal bihari vajpayee
Highlights

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి మృతిపై ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు తమ సంతాపం ప్రకటించాయి. శత్రు దేశాలను కూడా మిత్ర దేశాలుగా మార్చే దౌత్యనీతితో అంతర్జాతీయంగా భారత్‌ను ఒకస్థాయికి తీసుకెళ్లిన వాజ్‌పేయీ సేవలను ప్రపంచ నేతలు కొనియాడారు. 

ఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి మృతిపై ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు తమ సంతాపం ప్రకటించాయి. శత్రు దేశాలను కూడా మిత్ర దేశాలుగా మార్చే దౌత్యనీతితో అంతర్జాతీయంగా భారత్‌ను ఒకస్థాయికి తీసుకెళ్లిన వాజ్‌పేయీ సేవలను ప్రపంచ నేతలు కొనియాడారు. 

దాయాది దేశం పాకిస్థాన్‌, అమెరికా, రష్యా, బ్రిటన్‌, జపాన్‌ సహా సార్క్‌ దేశాధినేతలు తమ సంతాపం తెలిపారు. భారత్‌, అమెరికా సంబంధాలు మెరుగుపరచడంలో వాజ్‌పేయీ కీలక పాత్ర పోషించారని అమెరికా గుర్తుచేసింది. ఇరుదేశాల మధ్య సహజసిద్ధ సంబంధాలు ఉన్నాయని వాజ్‌పేయీ అనేవారని ఢీల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

భారత రాజకీయాల్లో వాజ్‌పేయీ పేరు ఓ అంతర్భాగమైందని.. ప్రపంచం ఒక గొప్ప రాజనీతిజ్ఞుడ్ని కోల్పోయిందని భారత్‌లో రష్యా రాయబారి విచారం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌కు అటల్‌ మంచి మిత్రుడని ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా అన్నారు. 

శాంతి కోసం వాజ్‌పేయీ చేసిన ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలు ఇస్తాయని పాకిస్థాన్‌ కాబోయే ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. భారత్‌, పాక్‌ సంబంధాల బలోపేతానికి విదేశాంగ మంత్రిగా పునాది వేసిన వాజ్‌పేయీ ప్రధాని అయ్యాక వాటిని కొనసాగించారని ఇమ్రాన్‌ గుర్తు చేశారు.
 

loader