న్యూఢిల్లీ:ఇవాళ సాయంత్రం 6. 30 గంటలకు అంతర్జాతీయ న్యాయస్థానం కులభూషణ్ జాదవ్ కేసులో తుది తీర్పు ను వెల్లడించనుంది. ఈ తీర్పు కేవలం ఒక ఖైదు చేయబడ్డ భారతీయుడి ప్రాణాల విషయమే కాకుండా అంతర్జాతీయ చట్ట పరిధిలోని ఒక కీలక అంశాన్ని కూడ తేల్చనుంది.

కుల్‌భూషణ్ కేసు పరిశీలిద్దాం

 కులభూషణ్ జాదవ్ అనే రిటైర్డ్ నేవీ అధికారిని పాకిస్తాన్ గూఢచర్యం కేసులో అరెస్ట్ చేసింది. అక్కడి మిలటరీ కోర్టులో అతన్ని విచారించి  2017 ప్రారంభంలో ఉరిశిక్షను ఖరారు చేసింది. ఈ విషయాల గురించి తెల్సుకున్న భారత ప్రభుత్వం వియన్నా కన్వెన్షన్ ప్రకారం కులభూషణ్ కు కాన్సులర్ యాక్సిస్ కల్పించలేదని, సరైన తీరులో విచారణ జరపకుండానే ఉరిశిక్ష వేశారని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 

అతను ఇరాన్ లో వ్యాపారనిమిత్తం పర్యటిస్తున్న సమయంలో పాక్ కిడ్నాప్ చేసిందని భారత్ వాదిస్తోంది. దీనితో తమ తుది తీర్పు వెలువడే  వరకు కులభూషణ్ కు శిక్ష ఖరారు చేయొద్దని పాక్ ను అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించింది. 

కాన్స్యులార్ యాక్సిస్ అంటే ???

ఎవరైనా విదేశీయుడిని అరెస్ట్ చేస్తే, అతనికి తన హక్కుల గురించి చెప్పాలి. అతను కావాలంటే అతని దేశ ఎంబసీ కి కూడా సమాచారం అందించాలి.  సదరు దేశ ఎంబసీ కి సమాచారమివ్వడంతోపాటు వారికి ఆ వ్యక్తిని కలిసి అతనికి అవసరమైన న్యాయపరమైన సహాయం అందించే వీలు కల్పించాలి. కులభూషణ్ కు ఏ రకమైన అవకాశం ఇవ్వకపోగా, అతని న్యాయ హక్కులకు కూడా భంగం వాటిల్లే విధంగా పాక్ ప్రవర్తించిందని భారత్ వాదించింది. 

కుల్‌భూషణ్ జాదవ్ గూఢచారి అంటూ పాకిస్తాన్ ఆరోపణలు చేస్తోంది. ఈ విషయాన్ని కుల్‌భూషణ్ కూడ ఒప్పుకొన్నాడని పాక్  వాదిస్తోంది. బలూచిస్తాన్‌లో తీవ్రవాద కార్యక్రమాలకు ఊతం ఇచ్చేందుకు  కుల్‌భూషణ్ జాదవ్  తమ దేశంలోకి ప్రవేశించారని పాక్ ఆరోపణలు చేస్తోంది.   
 
గూఢచర్యం చేసేందుకే  వచ్చినట్టుగా తాను వచ్చినట్టుగా కుల్‌భూషణ్ కూడ ఒప్పుకొన్నాడని  పాకిస్తాన్ ఆరోపిస్తోంది.  ప్రధాని మోడీ, భద్రతా సలహాదారు అజిత్ ధోవల్  మాట్లాడిన మాటల ఆధారంగా  పాక్ ఈ ఆరోపణలను చేస్తోందని భారత్  వాదిస్తోంది.  

అతడే ఒప్పుకున్నాడని, ఇతనికి వియన్నా నియమావళి వర్తించదని వాదిస్తోంది. ప్రధాని నరేంద్ర మోది, భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బలోచిస్తాన్ కు సంబంధించి మాటాడిన  మాటలను పట్టుకోని, ఇతను బలోచ్ లో తీవ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడానికి వచ్చాడని, వారి వ్యాఖ్యలే సాక్ష్యాలు అంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తుందని భారత్  

కుల్‌భూషణ్ వద్ద లభించిన రెండో పాస్‌పోర్ట్ లభించింది. ఈ పాస్‌పోర్ట్ హుస్సేన్ ముబారక్ పటేల్ పేరున ఉంది.ఈ పాస్‌పోర్ట్‌తో 17 దఫాలు విదేశీయానం చేశారు. అంతేకాదు పలు దేశాలకు కూడ వీసా దరఖాస్తులు కూడ చేసుకొన్నారు.  అయితే కుల్‌భూషణ్ తల్లి ఇంటి తల్లి అడ్రస్‌పై ఉంది.  ఒక వ్యక్తికి కాంస్యులార్ యాక్సిస్ ఇవ్వాలంటే అతడు తమ దేశస్తుడు అని  అవతలి దేశం నిరూపించాల్సి ఉంటుంది.

కానీ, ఇక్కడ వేర్వేరు పేర్లు ఉన్నాయి. దీంతో భారత్ తన వాదనను బలంగా విన్పించలేకపోతోంది. అంతర్జాతీయ సంప్రదాయాల ప్రకారంగా  గూఢచారి వియన్నా నియమావళి పరిధిలోకి రాడని పాక్ వాదిస్తోంది. భారత్ మాత్రం  అతను గూఢచారి అని చెప్పేందుకు సాక్ష్యాలను చూపాలని కోరుతోంది.

పాకిస్తాన్ లోని న్యాయ వ్యవస్థ సక్రమంగా లేదని మిలటరీ కోర్టుల్లో అరాచకత్వం తాండవిస్తోందని భారత్ వాదిస్తోంది.  యూరోపియన్ పార్లమెంట్ పాక్ న్యాయ వ్యవస్థపై చేసిన విమర్శలను  భారత్ గుర్తు చేస్తోంది. 

కుల్‌భూషణ్ విషయంలో  భారత్  అడిగినట్టుగా  అతడిని విడిచిపెడుతుందా.... లేదా  మామూలు కోర్టులో తన వాదనను విన్పించుకొనే అవకాశం కల్పిస్తోందా .. ఇక మరే శిక్ష విధిస్తోందా అనేది తేలనుంది.

 

సంబంధిత వార్తలు

కుల్‌భూషణ్ జాదవ్‌పై సాయంత్రం ఆరున్నరకు తీర్పు