భారత్ కు చెందిన కుల్‌భూషణ్ జాదవ్ విషయమై  అంతర్జాతీయ న్యాయస్థానం బుధవారం నాడు తీర్పును వెలువరిచే అవకాశం ఉంది. ఈ తీర్పు ఎలా ఉంటుందనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


న్యూఢిల్లీ: కుల్‌భూషణ్ వ్యవహారంపై అంతర్జాతీయ న్యాయస్థానం బుధవారం నాడు తీర్పును వెలువరించనుంది.కుల్‌భూషణ్ యాదవ్ గూఢచర్యానికి పాల్పడ్డారని పాక్ ఆరోపిస్తోంది. 

గూఢచర్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పాక్ కోర్టు కుల్‌భూషణ్ జాదవ్‌కు మరణశిక్షణను విధించింది. ఈ తీర్పును అంతర్జాతీయ కోర్టులో భారత్ సవాల్ చేసింది.కుల్‌భూషణ్ జాదవ్ కేసు విషయమై భారత్, పాక్ తరపు న్యాయవాదులు అంతర్జాతీయ న్యాయస్థానంలో తమ వాదనలను విన్పించారు.

 రెండు దేశాల వాదనలను విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ తీర్పును ఇవాళ సాయంత్రం భారత కాలమానప్రకారం సాయంత్రం ఆరున్నర గంటలకు వెలువరించనుంది.

2016 మార్చి 3వ తేదీన కుల్‌భూషణ్ జాదవ్‌ను పాకిస్తాన్ అధికారులు బలూచిస్తాన్‌లో అరెస్ట్ చేశారు. పాక్‌లో గూఢచర్యానికి దిగుతున్నాడనే ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు. కుల్‌భూషణ్ జాదవ్‌ను అరెస్ట్ చేసిన విషయాన్ని 2016 మార్చి 25వ తేదీన పాక్ ప్రభుత్వం ఇండియాకు అధికారికంగా అందించింది.

అరెస్ట్ చేసిన 20 రోజుల తర్వాత ఇండియాకు పాక్ ప్రభుత్వం ఇచ్చింది.అయితే ఎందుకు ఈ ఆలస్యమైందనే విషయమై పాక్ ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదు.గూఢచర్యం చేశాడని పాక్ మిలటరీ కోర్టు 2017 ఏప్రిల్ లో కుల్‌భూషణ్ జాదవ్‌కు మరణశిక్ష విధించింది. ఈ విషయం తెలిసిన ఇండియా అంతర్జాతీయ న్యాయ స్థానంలో 2017 మేలో పిటిషన్ దాఖలు చేసింది.

కుల్‌భూషణ్ జాదవ్‌ కు శిక్షను ఖరారు చేయడంలో పాక్ ప్రభుత్వం అన్ని రకాల అంతర్జాతీయ న్యాయసూత్రాలను ఉల్లంఘించిందని భారత్ ఆరోపించింది.భారత పౌరుడిగా ఉన్న కుల్‌భూషణ్ జాదవ్‌ను పాక్ కిడ్నాప్ చేసిందని భారత్ అంతర్జాతీయ న్యాయస్థానం దృస్టికి తీసుకెళ్లింది.

మరోవైపు పుల్వామా దాడి ఘటనలో 40 మంది సీఆర్‌పీఎఫ్ పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో మృతి చెందారు. ఈ ఘటనలో పాక్ పాత్ర ఉందని కూడ ఇండియా భారత్‌కు తేల్చి చెప్పింది.