Indore: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లో  ఐదు వేల మందికిపైగా విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు మానవహారంలాగా ఏరడ్పి అతి పెద్ద భారతదేశ ప‌టాన్ని రూపొందించారు. దీంతో ఇది వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కింది.

Indore: దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్ వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. 'హర్ ఘర్ తిరంగ' ప్రచారంలో భాగంగా దేశప్రజలు చాలా ఉత్స‌వంగా పాల్గొంటున్నారు. ఎక్కడ చూసినా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. స్వాతంత్ర్య అమృత్ మహోత్సవంలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ మరో ఘనత సాధించింది. వేలాది మంది ప్రజలు మానవ గొలుసు లాగా ఏర్ప‌డి.. భారతదేశ ప‌టాన్ని రూపొందించారు. ఇలా స‌రికొత్త ప్రపంచ రికార్డును సృష్టించారు. 

సమాచారం ప్రకారం.. 75 ఏళ్ల స్వతంత్ర వేడుకలైన ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా దివ్య శక్తిపీఠ్‌లో 'జ్వాల' అనే సామాజిక సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆగస్టు 14న ఇండోర్‌లోని దివ్య శక్తిపీఠంలో భారత చిత్రపటం రూపంలో 5,335 మంది విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు మాన‌వ హారంలా నిలిచారు. అతి పెద్ద మానవహారం( గొలుసు)గా ఏర్పడి దేశం మ్యాప్‌ను రూపొందించడంతో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది.

ఈ ప్రయత్నం ద్వారా భార‌త‌ భౌగోళిక పరిమాణంలో మానవ గొలుసును రూపొందించి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి స‌రికొత్త ప్రపంచ రికార్డు సృష్టించే ప్రయత్నం జరుగుతుందని జ్వాల వ్యవస్థాపకురాలు డాక్టర్ దివ్య గుప్తా తెలిపారు. కేవలం భారతదేశ ప‌టం బోర్డర్‌లోనే కాకుండా లోపల కూడా త్రివ‌ర్ణ పతాకం, అశోక చక్రం రూపంలో మాన‌వహారంలా ఏర్పడినట్లు చెప్పారు. దేశంలోని మహిళల ప్రాముఖ్యత, శక్తిని చాటేలా భారతదేశ ప‌టం చూట్టూ మహిళలను ఉంచినట్లు వెల్లడించారు.



ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర్యం పొంది 75వ సంవత్సరాన్ని జరుపుకోనుంది. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఆజాదీ అమృత్ మహోత్సవ్ కార్యక్ర‌మాన్ని నిర్వ‌హిస్తుంది. దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి, ఇందులో ప్రతి ఇంటికి త్రివర్ణ పతాకాలపై దేశప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

Scroll to load tweet…