చెన్నై: చంద్రయాన్-2 లో భాగమైన విక్రమ్ ల్యాండర్ శిథిలాలను నాసా కనుగొనడంలో చెన్నైకు చెందిన 33 ఏళ్ల షణ్ముగ సుబ్రమణ్యం అనే టెక్కీ కీలక పాత్ర పోషించాడు.విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కనిపెట్టడంలో సుబ్రమణ్యం కీలకంగా వ్యవహరించాడు.

విక్రమ్ ల్యాండర్‌ను ఆచూకీని కనిపెట్టే విషయంలో  శాస్త్రవేత్తలు ఆయనకు సహకరించారు. చంద్రుడికి అతి సమీపంలోనే విక్రమ్ ల్యాండర్ కుప్పకూలింది. అయితే విక్రమ్ ల్యాండర్ ఆచూకీని నాసానే కనిపెట్టలేకపోయింది.కానీ దీని ఆచూకీని కనిపెట్టడం అత్యంత సామాన్యమైంది కాదని షణ్మగం భావించాడు. ఈ ప్రక్రియలో తాను  చాలా కష్టపడినట్టుగా షణ్ముగం చెప్పారు.


విక్రమ్ ల్యాండర్‌ను కనిపెట్టేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు.ఈ క్రమంలోనే నాసా విడుదల చేసి విక్రమ్ ల్యాండర్ ఎల్ఆర్ఓ విడుదల చేసిన ఫోటోలను ఆయన  పరిశీలించారు. ఈ ఫోటోలను  ప్రజల కోసం నాసా విడుదల చేసింది.

ఎల్ఆర్ఓ ప్రాజెక్టు సైంటిస్ట్  నోహ్ పెట్రో నాసా ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. ఓ సాధారణ టెక్కీ విక్రమ్ ల్యాండర్‌ ను కనుగోనడం అద్భుతమన్నారు. అంతేకాదు విక్రమ్ ల్యాండర్ ఆచూకీని కనుగొనే విషయమై ఆయన తమకు సహకరించినట్టుగా ఆయన తెలిపారు.

సుబ్రమణ్యం విక్రమ్ ల్యాండర్ సమాచారాన్ని సేకరించాడన్నారు. ఈ విషయంలో ఆయన తనుకు ఉన్న ఆసక్తి కారణంగానే ఇది సాధ్యమైందని  చెప్పారు. నాసా విడుదల చేసిన ఒక్కొక్క ఫోటో ఆధారంగా సుబ్రమణ్యం విక్రమ్ ల్యాండర్ ఆచూకీని కనిపెట్టినట్టుగా  నాసా అధికారులు తెలిపారు. 

సుబ్రమణ్యం చెన్నైలో సాప్ట్‌వేర్ అర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నట్టుగా నాసా సైంటిస్ట్ పెట్రో చెప్పారు. తన తీరిక సమయంలో విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కోసం శోధించనున్నట్టుగా తమకు ఈమెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారని ఆయన గుర్తు చేసుకొన్నారు.

Also read:విక్రమ్ ల్యాండర్ జాడను కనుగొన్న నాసా... ఫోటోలు విడుదల

విక్రమ్ ల్యాండర్‌కు సంబంధించిన దృశ్యాలను ఈ ఏడాది సెప్టెంబర్  17వ తేదీన తీశాం, కానీ ఆ దృశ్యాలను సెప్టెంబర్ 26వ తేదీన విడుదల చేసినట్టుగా పెట్రో చెప్పారు.

సుబ్రమణ్యం ఒక్కడే విక్రమ్ ల్యాండర్ ను కనిపెట్టేందుకు ముందుకు వచ్చాడని ఆయన తెలిపారు.  సుబ్రమణ్యం తన ఆసక్తి మేరకు నాసా విడుదల చేసిన ఫోటోల ఆధారంగా విక్రమ్ ల్యాండర్ కూలిన స్థలాన్ని గుర్తించినట్టుగా చెప్పారు.

ఈ విషయాన్ని తమకు ఈమెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినట్టుగా తెలిపారు. ఈ ఫోటోల ఆధారంగా  పాత ఫోటోలు, కొత్త ఫోటోలను క్రమ పద్దతిలో అమర్చుతూ వెళ్తే విక్రమ్ ల్యాండర్  ఎక్కడ కూలిందో గుర్తించే అవకాశం ఉందని  సుబ్రమణ్యం తమకు తెలిపాడన్నారు.

సుబ్రమణ్యం ఇచ్చిన సమాచారం ఆధారంగా చేసిన అన్వేషణతో విక్రమ్ ల్యాండర్  శిథిలాలను గుర్తించినట్టుగా పెట్రో తెలిపారు.విక్రమ్ ల్యాండర్  శిథిలాలను సుబ్రమణ్యం గుర్తించినట్టుగా నాసా సైంటిస్ట్ తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ 6వ తేదీన విక్రమ్ ల్యాండర్ చంద్రయాన్-2 బృందంతో కాంటాక్టు కోల్పోయింది.