Asianet News TeluguAsianet News Telugu

మహిళల భద్రత, ఉపాధి క‌ల్ప‌న‌: 'మేక్ ఇండియా నంబర్ 1 ' ప్రక‌టించిన కేజ్రీవాల్

Arvind Kejriwal: ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధ‌వారం నాడు ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, యువతకు ఉపాధి, మహిళలకు సమాన హక్కులపై దృష్టి సారించడం ద్వారా దేశాన్ని "నంబర్ వన్"గా మార్చడానికి 'మేక్ ఇండియా నంబర్ 1' మిషన్‌ను ప్రకటించారు.
 

Womens security, employment vision: Kejriwal declares 'Make India No.1'
Author
Hyderabad, First Published Aug 17, 2022, 3:14 PM IST

Delhi chief minister Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత అరవింద్ కేజ్రీవాల్ బుధవారం నాడు 2024 సార్వత్రిక ఎన్నికల నేప‌థ్యంలో 'మేక్ ఇండియా నంబర్ 1' మిషన్‌ను ప్రారంభించారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. "ఈ దేశంలోని ప్రతి పౌరుడు.. 130 కోట్ల మంది.. ఈ మిషన్‌తో అనుసంధానం కావాలి" అని అన్నారు. భారత్‌ను  నెంబ‌ర్ వ‌న్‌గా మార్చేందుకు ఐదు ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కేజ్రీవాల్ అన్నారు. ఆ ఐదు అంశాలు విద్య, వైద్యం, ఉపాధి, మహిళల భద్రత, వ్యవసాయం అని పేర్కొన్నారు. 

ప్రజలను ఉద్దేశించి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, "మనం భారతదేశాన్ని మరోసారి ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా మార్చాలి. భారతదేశాన్ని మళ్లీ గొప్పగా మార్చాలి. మేక్ ఇండియా నెం.1 అనే జాతీయ మిషన్‌ను ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఈ దేశంలోని ప్రతి పౌరుడు.. 130 కోట్ల మంది ప్రజలు ఈ మిషన్‌తో అనుసంధానం కావాలి" అని అన్నారు. అలాగే, మహిళలకు సమాన హక్కులు, గౌరవం- రైతులకు సరసమైన పంట ధరలతో పాటు పౌరులందరికీ ఉచిత విద్య- వైద్యం-యువతకు ఉపాధి కల్పించడం ఈ మిషన్‌కు అవసరమని ఆప్ చీఫ్ అన్నారు. "మన మొదటి కర్తవ్యం భారతదేశంలోని ప్రతి బిడ్డకు ఎంత డబ్బు ఖర్చయినా, చదువుకునేలా చేయడం. రెండవ కర్తవ్యం ప్రతి పౌరుడు మెరుగైన-ఉచిత వైద్యం అందేలా చూడటం. మేము పాఠశాలలు, ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్‌లు మొదలైనవాటిని స్థాపించాలి. దేశంలోని ప్రతి మూలలో ఇవి ఉండాలి" అని కేజ్రీవాల్ అన్నారు.

"మూడవది, మన యువత ప్రస్తుతం నిరుద్యోగులుగా ఉన్నారు. మన యువతకు ఉద్యోగాలు వెతుక్కోవాలి. ఈ దేశంలో ఏ యువకుడూ నిరుద్యోగిగా ఉండకూడదు. ఈ దేశంలో ప్రతి మహిళను గౌరవించాలి, సమాన హక్కులు మరియు భద్రత పొందాలి" అని నాల్గో అంశం గురించి కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఐదవది, ఈ దేశంలోని రైతులకు వారి బకాయిలు చెల్లించాలని, ఈ ఐదు లక్ష్యాలను సాధిస్తే భారతదేశం ప్రపంచంలోనే నంబర్ 1 గా మారడాన్ని ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. అయితే, "మేక్ ఇండియా నంబర్ 1" మిషన్ అరాజకీయమని మిస్టర్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. తాను భారతదేశం అంతటా పర్యటిస్తానని.. ఈ చొరవలో చేరడానికి ప్రజలను ప్రోత్సహిస్తానని చెప్పారు.  ఇది పార్టీ రాజకీయాలకు అతీతంగా ఉందని, భారతదేశాన్ని ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా మార్చేందుకు ముందుకు రావాలని, మాతో కలిసి రావాలని బీజేపీ, కాంగ్రెస్‌లను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున గత సంవత్సరాలుగా దేశ రాజధానిలో ప్రభుత్వ పాఠశాలల నాణ్యతలో గణనీయమైన మెరుగుదలలు ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి బిడ్డకు మంచి పాఠశాలలు, కళాశాలలను అందించడం అవసరం అని అన్నారు."చదువుకున్న పిల్లవాడు అతని/ఆమె కుటుంబం పేదరికం నుండి బయటపడి ధనవంతులుగా మారేలా చేస్తుంది. ప్రతి కుటుంబం ధనవంతులైనప్పుడు, భారతదేశం ప్రపంచంలోని సంపన్న దేశాలలో ఒకటిగా ఉంటుంది" అని ఆయన వివరించారు. "ప్రతి భారతీయ పౌరుడు మాకు ముఖ్యం.. అందువల్ల అత్యుత్తమమైన ఆరోగ్య సంరక్షణ కోసం ఏర్పాట్లు చేయాలి. అది కూడా ఉచితంగా అందించబడుతుంది" అని ఆయన అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios