చీరలు కట్టుకుని నదిలోకి డైవింగ్.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వైరల్ వీడియో..
20 సెకన్లు ఉన్న ఈ వీడియోలో కొంతమంది మహిళలు చీరలతో నదిలోకి డైవింగ్ చేస్తున్నారు. ఆనందంతో కేరింతలు కొడుతున్నారు.
తమిళనాడు : చీర కట్టు అందానికే కాదు సౌకర్యానికీ చిరునామాగా మారుతోంది. చీరకట్టులో ఎన్నో సాహసాలు చేసి చూపిస్తున్నారు నేటి మహిళలు. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారిణి సుప్రియా సాహు షేర్ చేసిన వీడియోలో తమిళనాడులోని తామిరబరణి నదిలో చీరలు కట్టుకున్న కొంతమంది మహిళలు ఎత్తైన బ్రిడ్జి మీదినుంచి నదిలోకి డైవింగ్ చేయడం చూసినవారిని ఆశ్చర్యంలో ముంచేస్తోంది.
20 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో పెద్దవయసు మహిళలు.. చీరలు కట్టుకుని ఆనందంతో నదిలోకి దూకడంలాంటి దృశ్యాలు ఉన్నాయి. వీరంతా నిర్భయంగా, సంతోషంగా కేరింతలు కొడుతున్నారు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. ఆమె ఇలా రాసుకొచ్చారు.. "తమిళనాడులోని కల్లిడైకురిచి దగ్గరున్న తామిరబర్ని నదిలో ఈ చీరలు ధరించిన పెద్ద వయసులోని మహిళలు డైవింగ్ చేయడం చూసి ఆశ్చర్యపోయాను. అయితే, వారి ఈజ్ అది వారికి సాధారణ వ్యవహారం అని.. వారు అందులో ప్రవీణులని నాకు అర్థమయ్యింది. ఈ వీడియో ఖచ్చితంగా స్ఫూర్తిదాయకమైనది. వీడియో ఎవరు తీశారో తెలియదు. నాకు స్నేహితుని ద్వారా ఫార్వార్డ్ లో వచ్చింది" అని రాసుకొచ్చారామె.
భూకంప సహాయక సామగ్రితో టర్కీకి బయలుదేరిన భారత బృందం.. డాగ్ స్క్వాడ్లు, వైద్య సామాగ్రి..
ఈ వీడియో ట్విట్టర్‌లో 50,000 మంది చూశారు. అనేక మంది కామెంట్లతో వీరి సాహసాన్ని మెచ్చుకున్నారు. ఓ నెటిజన్ దీనిమీద కామెంట్ చేస్తూ.. వీడియో బాగుంది.. కానీ ఆ నదిలోని నీరు సురక్షితంగా డైవింగ్ చేయడానికి తగినంత లోతుగా లేదు" అన్నారు.
మరొక నెటిజన్ ఇలా వ్రాశారు, "తామరబరణి ఒక స్వస్థపరిచే నది - ఖచ్చితంగా స్వచ్ఛమైనది, సుందరమైనది. మన దేశంలోని నదులన్నా కాలుష్యానికి గురవుతున్నాయి. ఈ నదికి ఇంకా అలాంటి జాడలు సోకినట్టు లేదనిపిస్తుంది. కాలుష్యం బారిన పడకూడదని నేను ఆశిస్తున్నాను" అన్నారు.
మరో యూజర్ "భారతదేశంలో మహిళలకు తమిళనాడు నిస్సందేహంగా సురక్షితమైన రాష్ట్రం" అని వ్యాఖ్యానించారు. "పై నుండి డైవింగ్ చేయడం సాధారణంగా గ్రామ బావులలో పురుషులు, మహిళలు, పిల్లలు మొదలైన వారికి రోజువారీ పని. వారు దానిలో పూర్తిగా నేర్పు, నైపుణ్యాలతో ఉంటారు," అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.