కోడిగుడ్డు కూర వండలేదన్న కోపంతో.. భార్యపై బుల్లెట్ల వర్షం

First Published 14, Jul 2018, 4:58 PM IST
women shot dead by her husband for not cooking egg curry
Highlights

మద్యం ఎన్నో కుటుంబాల్లో విషాదానికి కారణమవుతోంది. తాజాగా తాను కోడిగుడ్డు కూర అడిగితే వండలేదన్న కోపంలో ఓ తాగుబోతు భర్త భార్యని కాల్చి చంపాడు

మద్యం ఎన్నో కుటుంబాల్లో విషాదానికి కారణమవుతోంది. తాజాగా తాను కోడిగుడ్డు కూర అడిగితే వండలేదన్న కోపంలో ఓ తాగుబోతు భర్త భార్యని కాల్చి చంపాడు.. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలోని దేవదాస్ గ్రామానికి చెందిన నవనీత్, మంగేశ్ శుక్లా భార్యభర్తలు..  వీరికి ముగ్గురు పిల్లలు.. నవనీత్ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మద్యానికి బానిసైన నవనీత్ గత గురువారం  పీకలదాకా తాగి ఇంటికొచ్చాడు..

అనంతరం తనకు కోడిగుడ్డు కూర కావాలని భార్యతో గొడవకు దిగాడు..ఆమె ససేమిరా అనడంతో ఆగ్రహంతో ఊగిపోయిన నవనీత్ ఇంట్లో ఉన్న తన తండ్రి లైసెన్స్‌డ్ తుపాకీతో భార్యపై కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్ధం విన్న స్థానికులు పరుగు పరుగున అక్కడికి వచ్చి రక్తపు మడుగులో పడివున్న మంగేశ్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు..

మంగేశ్ శుక్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నవనీత్‌ను అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. తల్లి చనిపోవడం... తండ్రి జైలుకు వెళ్లడంతో ముగ్గురు పిల్లలను నవనీత్ తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు.

loader