ప్రాణం తీసిన మరో వివాహేతర సంబంధం

women held for kills ex lover in noida
Highlights

బ్లాక్ మెయిల్ చేసి ప్రియుడి ప్రాణాలు తీసింది.

ప్రేమ మ్యాటర్ పెళ్లి పీటలు ఎక్కని విషయంలో దాదాపు అబ్బాయిలే.. అమ్మాయిలను ఎక్కువగా బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. గతంలో వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను నీ భర్తకు చూపిస్తానూ అంటూ.. చాలా మంది అబ్బాయిలు తమ మాజీ ప్రియురాళ్లను బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ సీన్ రిరవ్స్.. పెళ్లైన మాజీ ప్రియుడ్ని .. ప్రియురాలు బ్లాక్ మెయిల్ చేసింది. అందినంత డబ్బు గుజ్జింది. తర్వాత దారుణంగా హత్య చేసింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే...నోయిడా నగర శివార్లలోని లండోపురా గ్రామానికి చెందిన జితేంద్రసింగ్ రైతు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అదే గ్రామానికి చెందిన సోనం అనే 23 ఏళ్ల యువతితో గతంలో జితేంద్ర సింగ్ ప్రేమాయణం నడిపాడు. కానీ తర్వాత వేరే అమ్మాయితో వివాహం జరిగింది. అయినప్పటికీ సోనం..  జితేంద్రసింగ్ తో వివాహేతర సంబంధం కొనసాగించింది. 

అనంతరం తమ మధ్య ఉన్న సంబంధం గురించి ప్రియుడి భార్యకు చెబుతానంటూ బెదిరించి పలుసార్లు అతని నుంచి వేలాదిరూపాయల డబ్బు గుంజింది. మళ్లీ డబ్బులు ఇవ్వాలని సోనం అడగ్గా జితేంద్ర నిరాకరించాడు.దీంతో సోనం జితేంద్రను బిలాస్ పూర్ గార్డెన్ పార్కుకు రమ్మని పిలిపించి అతను రాగానే కర్రతో తలపై కొట్టి హతమార్చింది. అనంతరం స్కూటరుపై పారిపోయింది. 

మృతుడి సోదరుడు హతీంసింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా వారి విచారణలో సోనం నిందితురాలి అని తేలడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader