Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ : హనుమంతుని ఫొటో ముందు మహిళా బాడీబిల్డర్ల పోజులు.. గంగాజలం చల్లి శుద్ది...

మధ్య ప్రదేశ్ లో జరిగిన 13వ మిస్టర్ జూనియర్ బాడీ బిల్డింగ్ పోటీలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారాయి. మహిళా బాడీ బిల్డర్లు హనుమంతుడి ఫొటో ముందు ఫోజులివ్వడం వివాదానికి కారణంగా మారింది. 

women bodybuilders posing in front of Hanuman's photo, Congress leaders purified by sprinkling Ganga water in madhyapradesh - bsb
Author
First Published Mar 7, 2023, 8:43 AM IST

రత్లాం : మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన బాడీబిల్డింగ్ పోటీ వేదికపై కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం 'గంగాజలం' చల్లారు. శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకు కారణం మహిళా బాడీబిల్డర్లు క్రీడల పేరుతో బ్రహ్మచారి అయిన హనుమంతుడిని అవమానించారని ఆరోపించినట్లు తెలుస్తోంది.

మార్చి 4, 5 తేదీలలో 13వ మిస్టర్ జూనియర్ బాడీబిల్డింగ్ పోటీలు  జరిగాయి. ఆ పోటీల్లో పాల్గొన్న మహిళా బాడీబిల్డర్లు హనుమంతుడి ఫొటో ముందు పోజులు ఇచ్చారు. దీన్ని నిరసి్తూ పోటీల అనంతరం స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆ ప్రదేశంలో  'గంగా జల్' చల్లి 'హనుమాన్ చాలీసా' పఠించారు" అని పార్టీ కార్యకర్తలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలో... ఆర్గనైజింగ్ కమిటీలో నగర బీజేపీ మేయర్ ప్రహ్లాద్ పటేల్, శాసనసభ్యుడు చైతన్య కశ్యప్ లు ఉన్నారు. పగటిపూట సోషల్ మీడియాలో కనిపించిన ఈ ఈవెంట్ వీడియోలో మహిళా బాడీబిల్డర్లు పోజులివ్వడం కనిపించింది. దీనిమీద మాజీ మేయర్, కాంగ్రెస్ నాయకుడు పరాస్ సక్లేచా స్పందిస్తూ..  పటేల్, కశ్యప్ "అసభ్యతను" ప్రోత్సహించారని ఆరోపించారు. జిల్లా యూత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మయాంక్ జాట్ మాట్లాడుతూ హనుమంతుడు ఈ ఘటనకు పాల్పడిన వారిని శిక్షిస్తాడన్నారు. 

కేరళ సీఎం.. ధోతిలో ఉన్న మోడీ.. ఏషియానెట్ ఆఫీసుపై పోలీసుల దాడిని ఖండించిన కాంగ్రెస్

రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి హితేష్ బాజ్‌పాయ్ దీనిమీద మండిపడుతూ మహిళలు క్రీడల్లో రాణించడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదన్నారు. అయితే, కొంతమంది ఈవెంట్ నిర్వాహకులు కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు మెమోరాండం సమర్పించారు. ఈ మేరకు విడుదల చేసిన ఓ వీడియోలో బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. "కాంగ్రెస్‌వారు మహిళలు రెజ్లింగ్, జిమ్నాస్టిక్స్ లేదా స్విమ్మింగ్‌లో పాల్గొంటున్నట్లు చూడలేరు, ఎందుకంటే వారిలోని దెయ్యం దీనిని చూసి మేల్కొంటుంది. వారు ఆట స్థలంలో మహిళలను వక్రదృష్టితో చూస్తారు. అలా చూడడానికి వారికి సిగ్గు లేదా?" అని ప్రశ్నించారు. 

ఇదిలావుండగా, ఆదివారం ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమం హిందువులను, హనుమంతుడిని అగౌరవపరిచిందని ఆరోపిస్తూ, ఎంపీ, కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్, మీడియా సలహాదారు పీయూష్ బాబెలే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ క్షమాపణలు చెప్పాలని కోరారు. "అశ్లీలతకు మద్దతిచ్చినందుకు".. టెలివిజన్ చర్చలకు తమ పార్టీ బాజ్‌పాయ్‌ను బహిష్కరిస్తుందని బాబెలే చెప్పారు."

Follow Us:
Download App:
  • android
  • ios