Asianet News TeluguAsianet News Telugu

కేరళలో మరో క్షుద్రపూజ కలకలం .. ఏకంగా పిల్లలతో, పోలీసుల అదుపులో మంత్రగత్తె

కేరళలోని పథనంతిట్టలో మరో నలబలి కలకలం మరిచిపోకముందే మరో క్షుద్రపూజల ఘటన వెలుగులోకి వచ్చింది. పథనంతిట్ట జిల్లాలోని మలయాళపూజ పట్టణానికి చెందిన శోభన అలియాస్ వాసంతి క్షుద్రపూజలు చేస్తూ వుంటుందని స్థానికులు చెప్పారు.

women arrested over occult practice using children emerges in Kerala
Author
First Published Oct 13, 2022, 8:26 PM IST

కేరళలోని పథనంతిట్టలో మరో నలబలి కలకలం మరిచిపోకముందే మరో క్షుద్రపూజల ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మంత్రగత్తె క్షుద్రపూజలకు చిన్నపిల్లలను ఉపయోగిస్తున్నట్లు స్థానికులు గుర్తించి ఆందోళనకు దిగారు. ఆ మంత్రగత్తెను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో మంత్రగెత్తెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పథనంతిట్ట జిల్లాలోని మలయాళపూజ పట్టణానికి చెందిన శోభన అలియాస్ వాసంతి క్షుద్రపూజలు చేస్తూ వుంటుందని స్థానికులు చెప్పారు. చిన్న పిల్లల్ని తన ముందు కూర్చోబెట్టి తాంత్రిక కార్యాలు నిర్వహిస్తూ వుంటుందని అంటున్నారు. క్షుద్రపూజల్లో పాల్గొన్న ఒక చిన్నారి స్పృహతప్పి పడిపోయింది. స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో మంత్రగత్తెను అరెస్ట్ చేశారు పోలీసులు. 

కాగా... కేరళ నరబలి ఘటనతో దేశమంతా ఒక్కసారి ఉలిక్కిపడింది. ఈ ఘటనలో విషయాలు మనిషి నాగరికతనే ప్రశ్నించేలా ఉన్నాయి. సిరి సంపదలు వస్తాయని నరబలికి దంపతులు అంగీకరించడం, మనిషి బాడీ పార్టులను ఉడికించుకుని తింటే యవ్వనులుగానే ఉంటారనే మాటలు విశ్వసించారంటే వారి ఆలోచన ప్రగతి ఎక్కడ గడ్డకట్టుకుపోయిందా? అనే అనుమానాలు వస్తున్నాయి. విషయాలు వెలుగులోకి వచ్చినకొద్దీ ఈ ఎపిసోడ్ మరింత క్రూరంగా కనిపిస్తున్నది. ఇద్దరు మహిళలను మూఢ నమ్మకాలతో అత్యంత దారుణంగా హతమార్చడమే కాదు.. అవే గుడ్డి నమ్మకాలతో సొంత భార్య పైనే అత్యాచారానికి భర్త అంగీకరించాడు. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

ALso Read:నరబలికి ముందు రేప్.. భర్త కళ్లెదుటే భార్యపై షఫీ అత్యాచారం?

ఫేస్‌బుక్ ద్వారా కుట్ర పన్ని మహమ్మద్ షఫీ అనే దుర్మార్గుడు భగవాల్ సింగ్‌కు మాంత్రికుడిగా పరిచయం అయ్యాడు. తన ఆర్థిక నష్టాలు, అప్పుల గురించి చెప్పి.. వాటికి పరిష్కారం కావాలని కోరాడు. దీనికి నరబలి అవసరం అని ఉన్మాదుడైన షఫీ సూచించాడు. ఆడవాళ్లపై తీవ్ర కామేచ్ఛతో రగిలే షఫీ ఇందుకు ఓ కండీషన్ పెట్టాడు. ఈ నరబలి అనే ఘట్టం చేపట్టడానికి ముందు భగవాల్ సింగ్ భార్యతో తాను సంగమించాలని, అది ఈ నరబలిలో భాగం అని వివరించాడు. ఈ దుష్ట నిర్ణయానికి భగవాల్ సింగ్ అంగీకరించాడు.

భగవాల్ సమక్షంలోనే ఆయన భార్య లైలాపై మహమ్మద్ షఫీ లైంగికదాడి చేశాడు. ఈ దారుణానికి భర్త అంగీకరించాడు. భార్య లైలా అయిష్టంగానైనా ఆమోదించక తప్పలేదు. అత్యాచారం జరిగిందా, లేదా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు. ఆ తర్వాత తమకు ఎలాగైనా సంపద రావాలని, అందుకోసం ఎక్కువ మొత్తంలోనైనా డబ్బు చెల్లించడానికి సిద్ధం అని భగవాల్ ఆ షఫీకి చెప్పాడు. దీన్ని షఫీ ఆసరాగా తీసుకుని మరో కుట్రకు తెరలేపాడు. మూఢ నమ్మకాలపై వారి విశ్వాసాన్ని తాను సొమ్ము చేసుకోవడానికి ప్లాన్ వేశాడు. నరబలి ఇవ్వాలని, అందుకు తానే మనిషిని తెస్తా అని చెప్పాడు. భగవాల్ సింగ్, లైలాలను మోసం చేయడానికి మహిళలతో డీల్ కోసం షఫీ మాట్లాడటం మొదలు పెట్టాడు.ఈ క్రమంలోనే రొస్లిన్, పద్మలను తెచ్చాడు.

Follow Us:
Download App:
  • android
  • ios