మహిళతో వివాహేతర సంబంధం కలిగివున్నాడేనే ఆరోపణలతో ఓ యువకుడిని సజీవ దహనం చేశారు. వివరాల్లోకి వెళితే... ఉత్తర ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా భుజామి గ్రామానికి చెందిన అంబికా పటేల్.. ఓ మహిళ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Also Read:అక్రమ సంబంధం.. బెడసి కొట్టడంతో.. ఊపిరుండగానే...

దీనిని చూసిన మహిళ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం నడుస్తుందన్న అనుమానంతో సోమవారం భుజామి పటేల్‌ ఇంటిపై మహిళ బంధువులు దాడి చేశారు.

యువకుడిని ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి  చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. అక్కడితో ఆగకుండా కోపంతో ఊగిపోతూ.. బాధితుడిపై పెట్రోల్  పోసి నిప్పంటించారు. దీంతో యువకుడు అక్కడికక్కడే మరణించాడు.

Also Read: భార్య వివాహేతర సంబంధం.. భర్త హత్య?

అతని హత్యతో కుటుంబసభ్యులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ వాహనాలను దగ్ధం చేసి ఆందోళనకు దిగారు. పరిస్ధితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించారు.