తీహార్ జైళ్ల అధికారి దీపక్‌ శర్మ తమపై చేసిన ఆరోపణలు అవాస్తవమని మహిళా రెజ్లర్‌ రౌనక్‌ గులియా తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేసింది. ఆ వీడియో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. 

జాతీయ స్థాయి మహిళా రెజ్లర్‌ రౌనక్‌ గులియా, ఆమె భర్త అంకిత్ గులియా తనను రూ.50 లక్షల రూపాయల మోసం చేశారని ఆరోపిస్తూ తిహాడ్‌ జైలు అధికారి దీపక్‌ శర్మ్‌ ఇటీవల వారిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.. అయితే.. అయితే.. ఆ ఆరోపణలను రెజ్లర్‌ రౌనక్‌ గులియా తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఇన్‌స్టా గ్రాం వేదికగా ఓ వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ‘ఇదే తన చివరి వీడియో’ అని తన బాధను వెల్లగక్కింది. అసలేం జరిగిందంటే..

బాడీ బిల్డర్‌ కాప్‌ (BodyBuilder Cop)గా గుర్తింపు తెచ్చుకున్న దీపక్‌ శర్మ ప్రస్తుతం తీహార్ జైల్లో అసిస్టెంట్ సూపరిండెంట్‌గా పనిచేస్తున్నారు. ఓ రియాల్టీ షోలో పరిచయమైన ప్రొఫెషనల్‌ రెజ్లర్‌ కపుల్ రౌనక్‌ గులియా,అంకిత్‌ గులియాలు తనను మోసం చేశారని చీటింగ్ కేసు పెట్టారు. ఆ రెజ్లర్ దంపతులిద్దరూ ఆరోగ్య ఉత్పత్తుల వ్యాపారం నిర్వహిస్తున్నారని, తమ వ్యాపారాన్ని విస్తరణ కోసం తనని సంప్రదించారని తెలిపారు.

ఈ తరుణంలో తాము తమ కంపెనీలో పెట్టుబడిదారుల కోసం వెతుకుతున్నామనీ, తమ వ్యాపారంలో భారీ లాభాల వాగ్దానాలిచ్చారని తెలిపారు. ఈ క్రమంలో వారి వ్యాపారంలో తనతో రూ.50లక్షలు పెట్టుబడి పెట్టించారని అన్నారు. అయితే.. ఆ తర్వాత ఆ సొమ్మును తనకు తిరిగి ఇచ్చేందుకు ఆ రెజర్ల దంపతులు నిరాకరించారని దీంతో తాను వారిపై కేసు పెట్టినట్లు తెలిపారు. బాడీ బిల్డర్‌ కాప్‌ దీపక్‌ శర్మ ఫిర్యాదు మేరకు.. రెజ్లర్ దంపతులపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు పోలీసులు.

పోలీసు అధికారిని లక్షల రూపాయల మోసం చేశారనే ఆరోపణలపై జాతీయ స్థాయి మహిళా రెజ్లర్ రౌనక్‌ గులియా స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను కొట్టివేస్తూ ఆన్‌లైన్‌లో వీడియోను పంచుకున్నారు. "ఇది నా చివరి వీడియో. నన్ను క్షమించండి, ఇకపై ఆరోపణలను భరించే ధైర్యం నాకు లేదు. దేవుడు అతన్ని చూస్తాడు. అతను చేసిన పనులకు శిక్ష అనుభవిస్తాడు" అని మహిళ రెజ్లర్ కన్నీటి పర్యంతమయ్యారు.

View post on Instagram

తన వీడియోలో.. మహిళ రెజ్లర్ రౌనక్ గులియా తనపై వచ్చిన ఆరోపణను అన్ని అబద్ధాలేనని కొట్టిపారేశారు. తాను పరారీలో లేనని, తనపై తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పుకొచ్చారు. తాను ఏలాంటి నేరానికైనా పాల్పడినట్టు రుజువు అయితే.. తనని అరెస్టు చేయండని ఆమె చెప్పారు. ఆ పోలీసు అధికారికి, తన భర్త మధ్య కొన్ని చట్టవిరుద్ధమైన ఒప్పందాలు కూడా జరిగాయని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ కేసు గురించి దీపిక్‌ శర్మ తమను గతంలో బెదిరించాడని రౌనక్‌ ఆరోపించారు.