లైంగిక వేధింపులను వ్యతిరేకించినందుకు ఓ మహిళను, ఆమె బంధువును కదులుతున్న రైలులో నుంచి తోసేశారు దుండగులు. ఈ ఘటన గ్వాలియర్ లో వెలుగు చూసింది. 

గ్వాలియర్‌ : కదులుతున్న రైలులో తనపై లైంగిక వేధింపులకు ప్రయత్నించిన ఐదుగురు వ్యక్తులు.. దానికి వ్యతిరేకించినందుకు తనను, తన బంధువును కదులుతున్న రైలులోంచి తోసివేశారని ఒక మహిళ ఆరోపించింది. ఈ ఘటనలో మహిళ, ఆమె బంధువుకు గాయాలు అయ్యాయి. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.

గ్వాలియర్‌లో సోమవారం రాత్రి ఓ మహిళను, ఆమె బంధువును ఐదుగురు వ్యక్తులు కదులుతున్న రైలు నుంచి బలవంతంగా తోసేశారని పోలీసులు గురువారం తెలిపారు. ముజఫర్‌పూర్‌ నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్తున్న సూరత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో లైంగిక వేధింపుల ఘటన చోటుచేసుకుంది.

రాత్రి భర్తతో గొడవ.. తెల్లారే సరికి బావిలో శవాలుగా భార్య, ముగ్గురు పిల్లలు...

తన బంధువులతో కలిసి జార్ఖండ్‌ నుంచి సూరత్‌కు వెళుతుండగా ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు తనపై లైంగిక వేధింపులకు ప్రయత్నించారని బిలువా పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో మహిళ పేర్కొంది. మహిళకు, నిందితుడికి మధ్య ఏదో విషయంలో వాగ్వాదం జరగడంతో.. వారు ఆమెమీద లైంగిక దాడికి ప్రయత్నించారు. నిందితుడు తన అనుమతి లేకుండా తన ఫొటోలు కూడా తీశాడని ఆమె పేర్కొంది.

ఆ మహిళ అభ్యంతరం చెప్పడంతో ఆమె బంధువును నిర్దాక్షిణ్యంగా కొట్టారు. బాధితులు ట్రైన్ డోర్ దగ్గరికి తమ తమ సీటును మార్చుకోవడం ద్వారా గొడవకు పుల్ స్టాప్ పెట్టాలని ప్రయత్నించారు. అయితే నిందితులు వారిని వెంబడించి, చీర లాగుతూ మహిళను వేధిస్తూనే ఉన్నారు.

పరిస్థితి చేయిదాటిపోయింది. నిందితులు బాధితురాలి బట్టలు బలవంతంగా లాగేయడంతో ఆమె అర్ధనగ్నంగా ఉండిపోయింది. దీంతో నిందితుడు తనను, తన బంధువును కదులుతున్న రైలు నుంచి తోసేశాడని బాధితురాలు తెలిపింది. దీంతో రైలునుంచి కిందపడ్డ బాధితులు.. రాత్రంతా గాయాలతో.. బరోడి గ్రామ సమీపంలో అపస్మారక స్థితిలో పడి ఉన్నారు.

ఉదయం వారిని స్థానిక గ్రామస్థులు కనుగొన్నారు. గ్రామస్తులు వెంటనే వారిని మంగళవారం ఉదయం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మహిళ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. గ్వాలియర్ ఎస్పీ రాజేష్ సింగ్ చందేల్ నేతృత్వంలోని అధికారులు, సంఘటనలోని నిజానిజాలు తేల్చడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఎస్ డీఓపీ దాబ్రా, బిలౌవా స్టేషన్ ఇన్‌ఛార్జ్‌ను ఆదేశించారు.

“రైలులో ఉన్న ప్రయాణికుల సంఖ్యను నిర్ధారించడానికి, హేయమైన చర్యకు బాధ్యులను గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్టేషన్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నామని ఎస్పీ గ్వాలియర్ రాజేష్ సింగ్ చందేల్ తెలిపారు.