Asianet News TeluguAsianet News Telugu

తమిళనాడులో దారుణం... ప్రియుడిపైనే యువతి యాసిడ్ దాడి... కత్తితో పొడిచి హత్యాయత్నం

ప్రేమ పేరిట తనను నమ్మించి మోసంచేసి మరో యువతిని పెళ్లాడిన ప్రియుడిపై ఓ యువతి యాసిడ్ దాడికి పాల్పడింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

woman throws acid on boyfriend face
Author
Tamilnadu, First Published Dec 5, 2021, 12:57 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

చెన్నై: కొందరు సైకోలు అమ్మాయిలపై యాసిడ్ దాడులకు పాల్పడిన ఘటనలు అనేకం. కానీ ఓ అమ్మాయే ప్రియుడిపై acid attack కు పాల్పడటమే కాదు కత్తితోపొడిచి హత్యాయత్నానికి పాల్పడిన అరుదైన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.   

వివరాల్లోకి వెళితే... కేరళకు చెందిన రాకేష్ కొన్నాళ్లక్రితం ఉపాది నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. అక్కడ తమిళనాడులోని కాంచిపురం కు చెందిన జయంతి(27)తో పరిచయం ఏర్పడింది. అక్కడే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారింది. స్వదేశానికి వెళ్లిన తర్వాత పెళ్లి చేసుకోవాలని భావించారు. ఆరునెలల క్రితం రాకేష్, జయంతి స్వదేశానికి వచ్చారు.  

అయితే ప్రియురాలికి ఇచ్చిన మాటతప్పి రాకేష్ మరో యువతిని వివాహమాడాడు. ఈ విషయం తెలియడంతో రాకేష్ కి ఫోన్ చేసిన జయంతి గొడవపడింది. తనను మోసం చేసిన ప్రియుడిపై రగిలిపోయిన ఆమె దారుణ నిర్ణయం తీసుకుంది. 

read more  సింగరేణి కాలనీ తరహాలో మరో ఘ‌టన.. ట్రంకుపెట్టెలో ఆరేళ్ల చిన్నారి..

మాట్లాడుకుందామని చెప్పి రాకేష్ ను కోయంబత్తూరుకు రప్పించింది జయంతి. ఈ క్రమంలో ఇద్దరూ మాట్లాడుకుంటుండగా ఒక్కసారిగా తనతో తెచ్చుకున్న యాసిడ్ ను ప్రియుడి ముఖంపై పోసింది. దీంతో విలవిల్లాడుతూ కిందపడిపోయిన ప్రియుడిపై కత్తితో పొడిచి murder attempt కు పాల్పడింది. 

ఇలా ప్రియుడిపై హత్యాయత్నం చేసిన జయంతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇద్దరు అపస్మారక స్థితిలో పడివుండటాన్ని గమనించినవారు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ హాస్పిటల్ కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

యువకుడిపై వివాహిత యాసిడ్ దాడి

ఇదిలావుంటే ఓ యువకుడిపై వివాహిత యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన ఇటీవల కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం పట్టణంలో వెలుగుచూసింది. యువకుడిపై యాసిడ్ పోసిన షీబా అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీలో రికార్డైన దృశ్యాల ఆధారంగా  ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. యాసిడ్ దాడితో యువకుడు కంటిచూపును కోల్పోయాడు.

idukkiలోని ఆదిమాలి ఇనుప బ్రిడ్జి వద్ద ఉన్న  చర్చి వెనుక ఈ ఘటన చోటు చేసుకొంది. యువకుడి వెనుక నుండి వచ్చి అతడిపై యాసిడ్ పోసిందని పోలీసులు తెలిపారు.  యువకుడితో ఉన్న యువకులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.  ప్రాథమిక చికిత్స పూర్తి చేసిన తర్వాత యువకుడిని తిరువనంతపురం మెడికల్ కాలేజీకి తరలించారు. 

read more  నన్ను ఎందుకు పుట్టనిచ్చావ్? తల్లికి వైద్యం చేసిన డాక్టర్‌పై బిడ్డ ఫిర్యాదు.. కోర్టులో కేసు విజయం

కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో షిబా కు యువకుడు పరిచయమయ్యాడు. అయితే ఈ పరిచయం కాస్తా ఇద్దరి మధ్య  ప్రేమకు దారి తీసింది. అయితే షీబాకు పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ఆ తర్వాత యువకుడికి తెలిసింది. ఈ విషయం తెలిసిన యువకుడు ఆమెతో బంధాన్ని తెంచుకొనే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె మాత్రం అతడితో బంధాన్ని కొనసాగించేందుకు ప్రయత్నించింది. ఈ విషయాలపై మాట్లాడేందుకు ఆదిమాలికి రావాలని యువకుడిని పిలిపించింది. ఈ సమయంలోనే యువకుడిపై ఆమె యాసిడ్ దాడికి దిగింది.   

Follow Us:
Download App:
  • android
  • ios