ఢిల్లీలోని ప్రశాంత్ విహార్‌లో జూలై 7 వ తేదీన ఓ వ్యక్తి పోలీసు అధికారినంటూ బెదిరించి.. 23 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఢిల్లీ : ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి తనను తాను పోలీస్ గా చెప్పుకుంటూ, బెదిరించి ఓ యువతి మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జూలై 7వ తేదీన జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసింది. ఢిల్లీలోని ప్రశాంత్ విహార్‌లోని ఆ యువతి అపార్ట్‌మెంట్ సమీపంలోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ వ్యక్తిని గురువారం అరెస్టు చేశారు. 

మహిళమీద అత్యాచారం చేయడం కోసం తనను తాను పోలీసు అధికారిగా చెపుతూ బెదిరించిన వ్యక్తి.. ఈ ఘటన తరువాత పరారీలో ఉన్నాడు. అతడిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. జులై 7న సాయంత్రం మహిళ తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కారులో కూర్చుని ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో నిందితుడు రవి సోలంకి తన మొబైల్ ఫోన్‌ తో కారు సైడ్ మిర్రర్‌లో కనిపించిన జంటను రహస్యంగా రికార్డ్ చేసి ఫోటోలు తీశాడు.

ఆ బాధితురాలిని బిడ్డకు జన్మనివ్వమని బలవంతం చేయలేం.. ఆ బాధ వర్ణనాతీతం: హైకోర్టు

కొంత సమయం తరువాత, ప్రియుడు ఆ మహిళను ఆమె అపార్ట్‌మెంట్ బయట వదిలేశాడు. అయితే నిందితుడు బైక్‌పై బయటే వేచి ఉన్నాడు. ఆ తరువాత అపార్ట్ మెంట్ లోకి మహిళను వెంబడించాడు. మెట్లపై ఒంటరిగా ఉన్న ఆమెను గుర్తించి.. తనను తాను పోలీసు అధికారి అని పరిచయం చేసుకున్నాడు.

ఆమెను బెదిరించడానికి బాయ్‌ఫ్రెండ్ తో కలిసి ఉన్నప్పుడు రికార్డ్ చేసిన వీడియోను ఆమెకు చూపించాడు. వీడియోను వైరల్ చేస్తానని బెదిరించాడు. ఆ తరువాత మెట్ల మీదే మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.ఆ మహిళ వెంటనే తన ప్రియుడికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలియజేసింది. మహిళ కుటుంబసభ్యులతో కలిసి కేసు పెట్టేందుకు పోలీసు స్టేషన్‌కు వెళ్లారు.

సీసీటీవీ ఫుటేజీ సాయంతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆమె చెప్పాన డిటైల్స్ ఆధారంగా నిందితుడి స్కెచ్‌ వేయించారు పోలీసులు. అలా వెతకడం మొదలు పెట్టగా, గురువారం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.