Asianet News TeluguAsianet News Telugu

దారుణం : భర్త పిలుస్తున్నాడని తీసుకెళ్లి.. మహిళకు మద్యం తాగించి, సామూహిక అత్యాచారం..

వివాహితను ఆమె భర్త పిలుస్తున్నాడని చెప్పి తీసుకువెళ్లిన యువకుడు.. మరో ముగ్గురితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. 
 

woman taken away as her husband was calling, and gang raped in uttarpradesh
Author
First Published Sep 26, 2022, 2:12 PM IST

ఉత్తరప్రదేశ్ : తెలిసినవారే కదా.. అని నమ్మినందుకు ఓ మహిళ సామూహిక అత్యాచారానికి గురయ్యింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాల్లోకి వెడితే.. బదోస్ రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళను భర్త పిలుస్తున్నాడని ఈ నెల 17న చెప్పాడు ఓ వ్యక్తి. అతను తనకు తెలిసివాడే కావడంతో అతనితో పాటు వెళ్లింది. ఆ యువకుడు ఆమెను గ్రామ శివారులోని చెరువు వద్దకు తీసుకువెళ్లాడు.

అప్పటికే అక్కడ మరో ముగ్గురు యువకులు ఉన్నారు. వారంతా తనకు తెలిసిన వారే కావడంతో మాట్లాడింది. ప్రమాదం ఏమీ అనిపించలేదు. అయితే, వారంతా కలిసి ఆమెతో బలవంతంగా మద్యం తాగించారు. ఆ తరువాత వరుసగా ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విసయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించారు. కొన్ని రోజులు మౌనంగా బాధను దిగమింగిన మహిళ.. ఆ తరువాత ధైర్యం చేసి భర్తకు నిజం చెప్పేసింది. దీంతో వెంటనే ఆ భర్త భార్యను తీసుకుని ఈ శనివారం నాడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నారు. 

షాకింగ్ ఘ‌ట‌న‌.. ప‌దేండ్ల బాలుడిపై గ్యాంగ్ రేప్‌.. ఇనుప రాడ్ల‌ను..

ఇదిలా ఉండగా, ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో హౌస్ కీపింగ్ పనులు చేసే మహిళపై వార్డ్ బాయ్ అత్యాచారం చేసిన ఘటన మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ కసప రాజు శ్రీనివాస్ కథనం ప్రకారం.. అంబర్ పేట, అలీ కేఫ్ ప్రాంతానికి చెందిన మహిళ (43) దిల్ సుఖ్ నగర్ నిఖిల్ ఆస్పత్రిలో హౌస్ కీపింగ్ గా రెండేళ్లుగా పనిచేస్తోంది. ఆమెకు భర్త, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈనెల 21న బుధవారం 8:30కి క్యాషియర్ ఫోన్ చేసి నైట్ డ్యూటీ ఉందని చెప్పడంతో రాత్రి 9 గంటలకు ఆమె  విధులకు హాజరు అయింది.

జగిత్యాలకు చెందిన మారుతి సందీప్(26)  పురానాపూల్ లో నివాసం ఉంటూ నిఖిల్ ఆస్పత్రిలో రాత్రిపూట వార్డ్ బాయ్ గా పని చేస్తున్నాడు. 21న రాత్రి నైట్ డ్యూటీకి హాజరైన అతను రెండో అంతస్థులోని గదిని శుభ్రం చేయడానికి వెళ్లిన మహిళ వెనకే వెళ్ళి తలుపు వేసాడు. ఆమె తప్పించుకునేందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా జుట్టు పట్టుకుని లాగి అత్యాచారం చేశాడు.  జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.  దీంతో భయపడ్డ బాధితురాలు  ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకొని శుక్రవారం మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు పరారీలో ఉన్నాడని ఇన్స్పెక్టర్ తెలిపారు. పోలీసులు ఫోన్ చెప్పేవరకు ఈ విషయం తమ దృష్టికి రాలేదని ఆస్పత్రి మేనేజర్ శ్రవణ్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios