Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ ఘ‌ట‌న‌.. ప‌దేండ్ల బాలుడిపై గ్యాంగ్ రేప్‌.. ఇనుప రాడ్ల‌ను..

New Delhi: ఢిల్లీలో పదేళ్ల బాలుడిపై సామూహిక అత్యాచారం జ‌రిగిన షాకింగ్ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. మైనర్ బాలుడిని ముగ్గురు మైనర్లు లైంగిక వేధింపులకు గురిచేసి, దారుణంగా కొట్టారని, వారిలో ఒకరు అతని బంధువు అని సమాచారం.
 

Shocking incident.. 10-year-old boy gang-raped; Three minors arrested for inserting rod into private parts
Author
First Published Sep 26, 2022, 1:15 PM IST

gang-raped 10 year old Delhi boy: దేశంలో అత్యాచార ఘ‌ట‌నలు క్ర‌మంగా పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌రో షాకింగ్ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ప‌దేండ్ల మైన‌ర్ బాలుడిపై మ‌రో ముగ్గురు మైన‌ర్లు గ్యాంగ్ రేప్ కు పాల్ప‌డ్డారు. అంత‌టితో ఆగ‌కుండా బాధితుడి ప్రాణాలు తీయ‌డినికి తీవ్రంగా ఇనుప‌రాడ్ల‌తో కొట్టారు. ఈ దారుణ ఘ‌ట‌న దేశ రాజ‌ధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. 

ఈ ఘ‌ట‌న గురించి పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. ఈశాన్య ఢిల్లీలోని న్యూ సీలంపూర్ ప్రాంతంలో 10 ఏళ్ల బాలుడిపై అతని ముగ్గురు స్నేహితులు సామూహికంగా లైంగిక‌దాడికి పాల్ప‌డ్డారు. అనంత‌రం అత‌న్ని ఇనుప రాడ్ల‌తో తీవ్రంగా కొట్టారు. ప్ర‌స్తుతం బాధితుడు ఆస్ప‌త్రిలో ప్రాణాలు నిలుపుకోవ‌డానికి పోరాడుతున్నాడ‌ని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని పట్టుకుని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచామనీ, మూడో నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. మైనర్ బాలుడిని ముగ్గురు మైనర్లు లైంగిక వేధింపులకు గురిచేసి, దారుణంగా కొట్టారని, వారిలో ఒకరు అతని బంధువు అని సమాచారం.

ఈ నేపథ్యంలో ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) పోలీసులకు నోటీసులు జారీ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. త‌న కుమారుడిపై ముగ్గురు వ్య‌క్తులు లైంగిక‌దాడి చేశార‌ని త‌మ‌కు ఫిర్యాదు అందింద‌ని డీసీడ‌బ్ల్యూ తెలిపింది. గ్యాంగ్ రేప్ చేయ‌డంతో పాటు తీవ్రంగా కొట్టి.. ఇనుప‌రాడ్ల‌ను ప్ర‌యివేటు పార్టుల్లోకి చొప్పించార‌ని బాధితురాలి కుటుంబ స‌భ్యులు ఫిర్యాదులో పేర్కొన్నార‌ని చెప్పారు. అయితే ఇప్పటి వరకు జరిపిన విచారణలో బాధితురాలి  ప్ర‌యివేటు భాగాల్లో రాడ్ అమర్చినట్లు తేలలేదనీ, అయితే వైద్య పరీక్షల ద్వారా అది నిర్ధారిస్తామని పోలీసులు తెలిపారు.

కాగా, ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి బాధితులు, నిందితులు ఇరుగుపొరుగు వారు కావ‌డం గ‌మ‌నార్హం. వీరిలో అంద‌రూ కూడా మైన‌ర్లే. దాదాపు ఒకే వ‌య‌స్సు క‌లిగి ఉన్నారు. సెప్టెంబ‌ర్ 18న ఈ దారుణ ఘ‌ట‌న జ‌రిగింది. సెప్టెంబర్ 22న ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో బాధితుడు అడ్మిట్‌ అయ్యాడని పోలీసులకు సమాచారం అందిందని అధికారులు తెలిపారు. వెంటనే, పోలీసు బృందం ఆసుపత్రికి చేరుకుని, పిల్లల తల్లిదండ్రులను కలిశారు. అయితే వారు ఈ ఘ‌ట‌న‌పై స్టేట్‌మెంట్ ఇవ్వడానికి నిరాకరించారు. బాలుడు వైద్యుల ప‌రిశీల‌న‌లో ఉన్నాడ‌ని పోలీసులు తెలిపారు. ఈ త‌ర్వాత కూడా పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కుటుంబ సభ్యులను తరచూ సంప్రదించినప్పటికీ, శనివారం వరకు వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించారు. పోలీసులు 'సఖి' అనే సంస్థ నుండి కౌన్సెలర్‌ను ఏర్పాటు చేసి, బాధితుడు, అతని తల్లికి కౌన్సెలింగ్ చేశారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

కౌన్సెలింగ్‌లో బాధితురాలి తల్లి సెప్టెంబర్ 18న తన కొడుకుపై అతని ముగ్గురు స్నేహితులు గ్యాంగ్ రేప్ చేసి.. కొట్టార‌ని తెలిపారు. ఆమె వాంగ్మూలం ఆధారంగా, భారతీయ శిక్షాస్మృతి, పిల్లల లైంగిక నేరాల రక్షణ చట్టంలోని సెక్షన్లు 377, 34 కింద కేసు నమోదు చేశాం: పోలీసు అధికారులు

నిందితులు లైంగిక‌దాడితో పాటు తన కొడుకును ఇటుకలు, రాడ్లతో కొట్టారని ఆ మహిళ పేర్కొంది. సెప్టెంబరు 22న జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసిన చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అరెస్టయిన నిందితుల వివరాలతో పాటు ఈ వ్యవహారంపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ కాపీని, సెప్టెంబర్ 28లోగా యాక్షన్ తీసుకున్న సమగ్ర నివేదికను సీడ‌బ్ల్యూసీ ప్యానెల్ కోరింది. డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా భయంకరమైన ఘటన. బాలుడి ప్రైవేట్‌ భాగంలో రాడ్‌ని గుచ్చి నిర్దాక్షిణ్యంగా కొట్టి నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలుడు ప్రస్తుతం ఆసుపత్రి ICUలో ఉన్నాడు. మా బృందం నిరంతర సాయం అందించ‌డానికి కుటుంబ సభ్యులతో ట‌చ్ లో ఉంది. నిందితులను వెంటనే అరెస్టు చేయాలి.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని అన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios