Asianet News TeluguAsianet News Telugu

కూతురికి మాత్రలు తెస్తానని వెళ్లి మృతదేహంగా మారిన తల్లి.. శవం పక్కన రోధిస్తూ 8 నెలల చిన్నారి.. అసలేం జరిగింది?

ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కూతురికోసం మాత్రలు తెస్తానని వెళ్లి మృతదేహంగా మారింది. దీనిమీద పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

woman suspicious death in haryana - bsb
Author
First Published Sep 30, 2023, 10:09 AM IST

కూతురికి గొంతునొప్పి కోసం మందులు తీసుకువస్తానని వెళ్లిన మహిళ శవంగా రోడ్డు పక్కన కనిపించింది. 8 నెలల ఆమె కొడుకు ఏడుస్తూ  మృతదేహం పక్కన కనిపించాడు. బాబు రోదనలు విన్న స్థానికులు.. ఏమైంది అని వచ్చి చూసేసరికి.. విగత జీవిగా ఉన్న మహిళ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే…

మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న హింసకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. అత్యాచారాలు, హత్యలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ప్రేమ పేరుతో, పెళ్లిపేరుతో  మోసం చేయడం మామూలుగా మారిపోయింది.  కట్టుకున్న వారే అత్యంత కర్కషంగా కడతేరుస్తున్న ఘటనలు కలవర పెడుతున్నాయి. హర్యానాలో వెలుగు చూసిన మహిళ మృతి కేసులో ఇలాంటి అనుమానాలే తలెత్తుతున్నాయి.

ODI WC 2023 : 38 గంటలు విమానంలోనే.. ఎకానమీ క్లాస్ లో ఇంగ్లండ్ జట్టుకు చేదు అనుభవం..

హర్యానా నూహ్ బిచౌర్ పోలీస్ స్టేషన్ పరిధి బిస్రూ గ్రామ సమీపంలో ఈ ఘటన  బుధవారం రాత్రి వెలుగు చూసింది. ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో రోడ్డు పక్కన పడి ఉంది. ఆమె ఎనిమిది నెలల కుమారుడు.. మృతదేహం పక్కన ఏడుస్తూ కనిపించాడు.  చిన్నారి ఏడుపు విని చుట్టుపక్కల వారు వచ్చి చూసేసరికి.. మహిళా చనిపోయి ఉంది.  దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

వారి సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. విచారణలో మహిళ  కోట్లాకా జిల్లా నుహ్ కి చెందిన  లాయర్ అయిన ఓ వ్యక్తి  భార్య శకున్నత్ (24) అని తెలిసింది. బుధవారం ఉదయం ఆ మహిళ తన నాలుగేళ్ల కూతురికి గొంతు నొప్పిగా ఉందని అనడంతో.. టాబ్లెట్స్ తీసుకురావడం కోసం  ఇంట్లో నుంచి వెళ్ళింది. తన 8 నెలల తన కొడుకును తీసుకెళ్లింది.

అలా వెళ్లిన శకున్నత్ సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదు. . కంగారుపడ్డ కుటుంబ సభ్యులు ఆమె కోసం ప్రయత్నిస్తే ఎలాంటి సమాచారం దొరకలేదు. చుట్టుపక్కల అంతా గాలించారు. ఆమె కోసం ఎదురు చూస్తుండగానే.. గురువారం ఉదయం తెలిసిన వారి ద్వారా ఆమె మరణ వార్త తెలిసింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.  కుటుంబ సభ్యులు వచ్చేసరికి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు.

ఎవరో ఆమెను హత్య చేసి మృతదేహాన్ని అక్కడ వదిలేసి వెళ్లిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. పోలీసులు దీనిమీద మాట్లాడుతూ త్వరలోనే నిందితులను పట్టుకుంటామని కేసును చేదిస్తామని తెలిపారు.  మహిళా అనుమానాస్పద మృతి ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios