రైలు ఎక్కబోయి జారి రైలుకి, ప్లాట్ ఫాంకి మధ్యలోని గ్యాప్ లో ఇరుక్కుపోయిందో మహిళ. రైలు స్పీడందుకోవడంతో కొద్ది దూరం అలాగే ఈడ్చుకెళ్లింది. 

చెన్నై : రైలు ఎక్కడానికి ప్రయత్నించిన ఓ మహిళ పట్టుతప్పి.. రైలుకు, ఫ్లాట్ ఫాంకు మధ్యలో పడిపోయింది. రైలు వేగం అందుకోవడంతో రైలుతో పాటు కాస్త దూరం వెళ్లింది. అప్రమత్తమైన ఆమె స్నేహితులు, ఆర్పీఎఫ్ జవాన్ వెంటనే రైలు డ్రైవర్ కు సమాచారం ఇవ్వడంతో రైలును ఆపాడు. దీంతో ఆ మహిళ కొన్ని గాయాలతో బయటపడింది. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో వెలుగు చూసింది. 

చెన్నైలో రైలు కోచ్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ మహిళ ప్లాట్‌ఫారమ్‌కు రైలుకు మధ్య ఉన్న గ్యాప్‌లో జారి పడిపోయింది. చుట్టూ ఉన్న జనాలు, ఆర్‌పిఎఫ్ జవాన్ ఆమెను రక్షించడంతో రైలు కొన్ని మీటర్ల దూరం లాక్కెళ్లిన తరువాత ఆమె ప్రాణాలతో బయటపడింది. 

ఆరుపదులు దాటినా భర్త అనుమానిస్తూ, కొడుతున్నాడని సుపారీ ఇచ్చి హత్య.. వీడియో తీసి, బ్లాక్ మెయిల్ చేయడంతో..

చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు కింద పడి కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకెళ్లబడింది ఆ మహిళ. కారుణ్య అనే మహిళ బుధవారం తన స్నేహితులతో కలిసి కేరళ వెళ్లడానికి రైలు ఎక్కుతుండగా ఈ ఘటన జరిగింది.

కారుణ్య కోచ్‌ ఎక్కేందుకు ప్రయత్నించగా, రైలు ప్లాట్‌ఫారమ్‌కు మధ్య ఉన్న గ్యాప్‌లో జారి పడింది. భయాందోళనకు గురైన ఆమె స్నేహితుడు ఆమెను బయటకు తీయడానికి ప్రయత్నించాడు, కాని రైలు కదలడం ప్రారంభించి వేగం పుంజుకుంది. ఇది గమనించిన వారు వెంటనే రైలు డ్రైవర్ ను అప్రమత్తం చేయడంతో కొద్దిదూరం వెళ్ళి ఆగింది. 

ఇతర ప్రయాణికులు, ఒక ఆర్ఫీఎఫ్ జవాన్ వెంటనే స్పందించి.. రైలు డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. దీంతో రైలు పట్టాల నుండి కారుణ్యను రక్షించారు. కారుణ్యకు స్వల్ప గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.