Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టిన మహిళ...వీడియో వైరల్.. ఎందుకంటే..

వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించడానికి వచ్చిన ఎమ్మెల్యేను ఓ మహిళ చెప్పుతో కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. 

Woman slaps MLA who visited flood affected areas in Haryana - bsb
Author
First Published Jul 13, 2023, 7:36 AM IST | Last Updated Jul 13, 2023, 7:36 AM IST

హర్యానా : హర్యానాలోని కైతాల్ జిల్లాలో బుధవారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ వరద బాధితురాలు పరామర్శించడానికి వచ్చిన  జననాయక్ జనతా పార్టీ (జేజేఏ) ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్‌ను చెప్పుతో కొట్టింది. ఈ ఘటన జరిగినప్పుడు ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ కైతాల్‌లోని గుహ్లా ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించడం గమనార్హం.

సమాచారం ప్రకారం.. గుహ్లా చీకా నియోజకవర్గ ఎమ్మెల్యే అక్కడికి వచ్చిన సమయంలో జనాలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. వారిలో  ఆ మహిళ కూడా ఉంది. నీరు పెద్ద ఎత్తున నిలిచిపోవడానిక కారణమైనడ్రైనేజీ వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వరదలతో అతలాకుతలం అవుతున్న సమయంలో ఇంత ఆలస్యంగా వస్తారా అంటూ జనం ప్రశ్నించారు. ఈ క్రమంలోనే  ఆగ్రహించిన ఓ మహిళ ఎమ్మెల్యేను చెప్పుతో కొట్టింది.

ఫ్రాన్స్ కు బయలుదేరిన మోదీ.. రెండు రోజులపాటు పర్యటన..

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో, మహిళ, స్థానికులు ఎమ్మెల్యేను "ఇప్పుడెందుకు వచ్చారు?" అంటూ గట్టిగా నిలదీస్తున్నారు.వారి బారినుంచి ఎమ్మెల్యేను ఆయన వ్యక్తిగత భద్రతా అధికారులు రక్షించారు.

అనంతరం ఎమ్మెల్యే సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను మహిళను క్షమించానని, ఆ మహిళపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోనని అన్నారు. "నేను మహిళపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోను, నేను ఆమెను క్షమించాను" అని ఎమ్మెల్యే చెప్పారు.

మరోవైపు, రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హర్యానాలో వరదలు వచ్చాయి. ఈ వరదల ప్రభావంతో10 మంది మరణించారని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ బుధవారం తెలిపారు.

వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియాను కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. "వరదల్లో ఇప్పటి వరకు 10 మంది మరణించారు, ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు, ఇద్దరు కనిపించకుండా పోయారు. చాలా పశువులు మరణించాయి... వరదల వల్ల ఏర్పడిన నష్టాన్ని అంచనా వేస్తాం... మృతుల కుటుంబాలకు కజ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తాం" అని ఖట్టర్ అన్నారు.

రాష్ట్రంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం ఖట్టర్ ఇక్కడ విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. "గత నాలుగు రోజులుగా, హర్యానాలోనే కాకుండా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌లలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వరదలు వచ్చాయి" అని అన్నారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios