Asianet News TeluguAsianet News Telugu

కొన్ని అదృశ్య శక్తులు నా సంపదను దోచుకుంటున్నాయి.. పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు

మధ్యప్రదేశ్‌లో ఓ వింత ఘటన ఎదురైంది. ఓ మహిళ విచిత్ర ఫిర్యాదుతో పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. కంటికి కనిపించని శక్తి తన వెంట పడుతున్నదని, తన ఆహారం, దుస్తులు చోరీ చేస్తున్నదని, తన నగల బరువునూ అదే తగ్గిస్తున్నదని ఫిర్యాదు చేశారు. కాబట్టి, ఆ అదృశ్య శక్తి బారి నుంచి తన వస్తువులను కాపాడాలని పోలీసులను కోరారు.
 

woman says invisible forces stoling her things
Author
Bhopal, First Published Dec 5, 2021, 8:20 PM IST

భోపాల్: ఇప్పటికీ చాలా మంది చేతబడులు, మంత్రాలు.. తంత్రాలను నమ్ముతుంటారు. దెయ్యాలు, భూతాలు అంటూ వణికిపోతుంటారు. ఇంకొందరు ఎప్పటికీ కొన్ని అదృశ్య శక్తులు వెంటాడుతున్నాయనే భయంలోనూ జీవిస్తుంటారు. అయితే, ఈ నమ్మకాలు మానసిక దృఢత్వంపై కొంత ప్రభావాన్ని చూపుతాయి. ఒక్కోసారి వీటి ఒత్తిడితో విపరీత పరిణామాలకూ దారి తీయవచ్చు. Madhyapradeshలోని ఓ మహిళ పరిస్థితి ఇలాగే ఉన్నది. ఏదో అదృశ్య శక్తి తనను వెంటాడుతున్నదని, తనకు తెలియకుండానే తన దుస్తులు చోరీ చేస్తున్నదని పేర్కొన్నారు. తన సంపాదనను, ఆహారాన్నీ దొంగిలించుకు(Theft) వెళ్లుతున్నదని ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

బెతూల్‌ జిల్లాకు చెందిన ఓ మహిళ ప్రధానమంత్రి రూరల్ రోడ్ మిషన్‌ కింద సబ్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ఈ మధ్య ఆమెను ఏదో కనిపించని శక్తి(Invisible Force) వెంటాడుతున్నట్టు భావిస్తున్నారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్వాలి పోలీసు స్టేషన్‌లో రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. ఏదో అంతుచిక్కని శక్తి తన ఆహారాన్ని తింటున్నదని ఆరోపించారు. తన నగల బరువునూ తగ్గిస్తున్నదని పేర్కొన్నారు. దుస్తులు, డబ్బులు దొంగిలిస్తున్నదని తెలిపారు.

Also Read: గతజన్మ గుర్తొచ్చింది.. ఆదివారాలు ఆఫీసుకు రాలేను.. ఇంజనీర్ లీవ్ అప్లికేషన్.. దిమ్మదిరిగే రిప్లై ఇదే

గత నాలుగు ఐదు రోజులుగా ఇదంతా జరుగుతున్నదని ఆమె పోలీసులకు తెలిపారు. కాబట్టి, తన ఆహారం, దుస్తులు, ఇతరత్రాలు ఆ కంటికి కనిపించని అదృశ్య శక్తిపాలు కాకుండా కాపాడాలని పోలీసులను కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు అవాక్కయ్యారు. ఆమె ఫిర్యాదు విని ఖంగుతిన్నారు. ఆమెకు ఎలా సర్దిచెప్పాలో అర్థం కాలేదు. ఎలాగోలా తేరుకుని ముందు ఆమెను ఓ సైకియాట్రిస్టు దగ్గరకు పంపాలని నిర్ణయించుకున్నారు.

సదరు మహిళ హలుజినేషన్‌కు గురవుతున్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఆమె నుంచి చోరీ అయ్యేదేమీ లేదని పేర్కొన్నారు. అదృశ్య శక్తి చోరీకి సంబంధించిన ఘటనలేమీ లేవని వివరించారు. అందుకే ఆమెను కౌన్సెలింగ్‌ కోసం ఓ సైకియాట్రిస్టు దగ్గరకు పంపాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. సాధారణంగా నగల బరువు వాడుతూ ఉంటే కొంత కాలం తర్వాత కొన్ని మిల్లీగ్రాముల మేరకు కరిగిపోతుందని అందరికీ తెలిసిందేనని వివరించారు.

Also Read: కథ అడ్డం తిరిగింది.. డిప్యూటీ కలెక్టర్ ఇంట్లోకి దోపిడీకి వెళ్లి.. షాకింగ్ లేఖ రాసి వచ్చిన దొంగ

మధ్యప్రదేశ్‌లో ఆదివారాలు సెలవులు కావాలని ఓ ఉద్యోగిన తనకు పాత జన్మ గుర్తుకు వచ్చిందని చెప్పిన అబద్ధం అప్పట్లో వైరల్ అయిది. అగర్ మల్లా జిల్లా సుస్నేర్‌లో డిప్యూటీ ఇంజినీర్‌గా చేస్తున్న రాజ్‌కుమార్ యాదవ్ పై అధికారికి.. ఆదివారాలు తాను పనికి హాజరుకాలేకపోతున్నానని, తనకు గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకువచ్చాయని ఓ లేఖలో తెలిపాడు. గత జన్మలో asaduddin owaisi తన మిత్రుడని, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ‘శకుని మామా’ అని చెప్పాడు. ‘నేను గీతా చదువుకుని నా గత జన్మ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నా. నా అహాన్ని నాశనం చేసుకోవడానికి ఇంటింటికి తిరిగి భిక్షం ఎత్తుకోవాలనుకుంటున్నా. ఇది నా ఆత్మక సంబంధించిన విషయం కావునా, నాకు ఆదివారాలు సెలవు ఇవ్వండి’ అని రాజ్‌కుమార్ యాదవ్ సుస్నేర్ జనపద్ పంచాయత్ సీఈవోకు లేఖ రాశాడు.

‘ప్రియమైన డిప్యూటీ ఇంజనీర్.. నీ అహాన్ని చంపుకోవాలనుకుంటున్నారు కదా. ఇది సంతోషదాయకమైన విషయం. ఇందులో మీరు మీ లక్ష్యాన్ని సాధించడానికి మేం తోడ్పడవచ్చు. ఒక మనిషి తన ఆదివారాలను ఏ విధంగానైనా గడుపుకోగలననే అహాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి ఇలాంటి అహాన్ని వేరుల నుంచి తీసేయడమే నీకు పురోగతినిస్తుంది. కాబట్టి, నీ స్పిరిచువల్ ప్రోగ్రెస్ కోసం మీరు ప్రతి ఆదివారాలూ ఆఫీసుకు హాజరై పనిచేయాలని ఆదేశిస్తున్నాం. తద్వారా ఆదివారాలను సెలవుగా వేడుక చేసుకోవాలనే నీ అహాన్ని ఈ విధంగా నాశనం చేసుకోవచ్చు’ అని జన్‌పద్ పంచాయత్ సీఈవో పరాగ్ పంతి సమాధానం రాశారు.

Follow Us:
Download App:
  • android
  • ios