Asianet News TeluguAsianet News Telugu

వివాహిత కిడ్నాప్, అత్యాచారం.. హత్య, ఆరుగురి అరెస్ట్...

ఓ వివాహితను కిడ్నాప్ చేసి హత్యాచారం చేసిన ఘటనలో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాజస్తాన్ లోని జైపూర్ లో చోటు చేసుకుంది. 

Woman raped and killed, six booked in Rajasthan
Author
First Published Oct 20, 2022, 11:27 AM IST

జైపూర్ : రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో 28 ఏళ్ల వివాహితను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, హత్య చేసిన ఆరోపణలపై ఒక వ్యక్తి, అతని తండ్రి, మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సిక్రి స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) మహేష్ మీనా తెలిపారు.

ఓ వివాహిత గత ఏడాది అక్టోబర్ 23న భర్తను వదిలేసి నిందితుడైన వ్యక్తితో వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆ తరువాత వీరిద్దరూ కలిసి ఉన్నారు. ఈ క్రమంలో ఆ మహిళ గర్భం దాల్చి అక్టోబర్ 14న ఆసుపత్రిలో చేరింది. అక్కడ ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది.
ఆసుపత్రి నుండి ఆమెను అక్టోబర్ 16న ఇంటికి వచ్చింది. కానీ అక్టోబర్ 17న, ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆమెను మళ్లీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడి వైద్యులు ఆమెను పరిశీలించి అల్వార్‌కు రిఫర్ చేశారు, అయితే అల్వార్‌కు తీసుకువెళుతుండగా, మార్గమధ్యంలోనే మహిళ మరణించిందని ఎస్హెచ్వో తెలిపారు. 

ముస్లింలు లక్ష్మీదేవిని పూజించరు.. వారు ధనవంతులు కాదా?: బీజేపీ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు..

మహిళ తండ్రి తెలిపిన వివరాల ప్రకారం, అతని కుమార్తె మూడు-నాలుగు నెలల క్రితం ఫోన్ చేసిందని, తను ఇష్టపడి వెళ్లిపోయిన వ్యక్తి తనను గొడ్డు మాంసం తినమని, నమాజ్ చేయమని బలవంతం చేస్తున్నట్టుగా చెప్పింది. నిందితులపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 366 (కిడ్నాప్), 376 (డి) (గ్యాంగ్ రేప్), 302 (హత్య), 346 (బందీలుగా తీసుకోవడం), ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.

ఇక మృతురాలైన ఆ మహిళకు 2010లో అల్వార్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. ఆమెకు 10 ఏళ్ల కుమారుడు, ఎనిమిదేళ్ల కూతురు ఉన్నారని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. 2020లో ఆమె భర్త ఆమె కిడ్నాప్‌ అయ్యిందంటూ కేసు నమోదు చేశారు. అయితే, ఆ కేసు అబద్ధమని, ఆమె ఇష్టపూర్వకంగానే వెల్లిందని తేలడంతో పోలీసులు ఫిబ్రవరి 2022లో కేసు మూసివేశారు. కాగా, బుధవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాధితురాలి గుర్తింపు ఆమె గోప్యతను కాపాడేందుకు బహిర్గతం చేయబడలేదు)

Follow Us:
Download App:
  • android
  • ios