ఆగ్రా: ప్రియుడి సహాయంతో  భర్తకు విషమిచ్చి చంపిందో భార్య. ఈ ఘటన  ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ లో చోటు చేసుకంది. ప్రియుడితో తనను భర్త పట్టుకోవడంతో ఆమె ఈ దారుణానికి పాల్పడింది.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్‌ నగరంలోని చార్‌బాగ్ ప్రాంతంలో సోమిఖ్‌లాల్, నెక్సీదేవీలు నివాసం ఉంటున్నారు. అయితే ఆమెకు  సంజయ్‌సింగ్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. 

ఒకరోజు ప్రియుడితో పడకగదిలో ఆమె రాసలీలల్లో ఉండగా  భర్త  సోమిఖ్‌లాల్ పట్టుకొన్నాడు. ఈ ఉదంతాన్ని గ్రామస్తులకు  చెబుతానని హెచ్చరించాడు.  అయితే  భర్తను  బతిమిలాడి నచ్చజెప్పింది. ఈ విషయాన్ని బయటకు చెప్పకూడదని వేడుకొంది.తాను భవిష్యత్తులో మరోసారి ఈ తప్పును చేయనని భర్తను నమ్మించింది. 

భర్తను  నమ్మించినట్టుగానే నమ్మించి  విషం కలిపిన పానీయాన్ని అతడికి ఇచ్చింది. అయితే భార్య చెప్పిన మాటలను విని మోసపోయిన భర్త  ఆ పానీయాన్ని తాగాడు. దీంతో అతను మృతి చెందాడు.  

అయితే తనకు ఏమీ తెలియనట్టుగానే తన భర్త గుండెపోటుతో మరణించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మృతదేహన్ని పోస్ట్ మార్టంకు పంపారు. పోస్ట్‌ మార్టం రిపోర్టులో  విష ప్రభావంతో సోమిఖ్ లాల్ మరణించాడని తేలింది. 

సోమిఖ్ లాల్  పై విష ప్రభావం గురించి పోలీసులు దర్యాప్తు చేస్తే అసలు విషయం వెలుగు చూసింది. ఈ విషయం బయటకు రావడంతో సోమిఖ్‌లాల్, నేక్సీదేవీలు పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.