ప్రేమికుడిని పెళ్లి చేసుకునేందుకు మాజీ ప్రియుడు అడ్డుగా ఉన్నాడని భావించిన ఒక యువతీ ఆ మాజీ ప్రియుడి అడ్డు తొలిగించుకోవడానికి దారుణానికి ఒడిగట్టింది. కొత్త ప్రేమికుడిని వివాహం చేసుకుంటే ఎక్కడ ఆ మాజీ ప్రియుడు అడ్డు తగులుతాడో అని భావించిన ఆ యువతీ ఆ మాజీ ప్రియుడ్ని కొత్త ప్రియుడితో కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేసింది. 

ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో జరిగిన ఈ దారుణం అందరిని నివ్వెర పోయేలా చేసింది. వివరాల్లోకి వెళితే... ఉమా శుక్ల అనే మహిళా తన భర్తతో విడిపోయి 2014 నుంచి ఒంటరి జీవితం గడుపుతుంది. ఆమెకు అలా ఒంటరిగా ఉంటున్న సమయంలో యోగేష్ సక్సేనా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా కూడా మారింది. 

Also read: పెళ్లైన 2 నెలలకే నవ వధువు అదృశ్యం: ఏడేళ్ల తర్వాత ప్రియుడితో ఇలా, షాకైన భర్త

ఇక పెళ్లి చేసుకుందామని అని ఆ సదరు మహిళా అడిగితే దానికి అంగీకరించిన యోగేష్... తన చెల్లెలి పెళ్లి అయ్యేంతవరకు ఆగమని ఆ తరువాత పెళ్లి చేసుకుందామని అన్నాడు. అప్పటివరకు తనకు సమయం కావాలని కోరాడు. 

ఇదే సమయంలో ఆమెకు సునీల్ శర్మ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కూడా ప్రేమగా మారింది. ఇప్పుడు సునీల్ శర్మను పెళ్లి చేసుకుంటే ఎక్కడ యోగేష్ అడ్డుపడతాడో అని భావించిన సదరు మహిళ... తన మొదటి ప్రియుడి అడ్డు తొలిగించుకోవాలని ప్లాన్ వేసింది. 

ప్లాన్ వేసిందే తడువుగా తన నూతన ప్రియుడు సునీల్ శర్మకు ఈ విషయం చెప్పింది. ఇద్దరు కలిసి ప్లాన్ చేసి అతడిని అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం ఒక నిర్మానుష్య ప్రదేశానికి యోగేష్ ని రప్పించారు. 

యోగేష్ అక్కడకు రాగానే అదను కోసం చూస్తున్న సునీల్ అతడి కళ్ళలో కారం కొట్టి గొంతు కోసి చంపేశాడు. ఆ తరువాత పెట్రోల్ పోసి ఆ శవాన్ని తగలబెట్టారు. ఒక్కసారిగా ఇలా శవం కనబడడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఈ కేసు విచారణను చేపట్టారు. ఛాలెంజ్ గా తీసుకొని ఈ కేసును 24 గంటల్లో పరిష్కరించి నిందితులను పట్టుకున్నారు.