Asianet News TeluguAsianet News Telugu

చాంతాండంత జడ... మర్రి చెట్టు ఊడల్లా మారిపోయింది...!

పెద్దగా కోరుకున్నంత పొడవు కూడా పెరగదు. కానీ, ఓ మహిళ తన జుట్టుకు కనీసం పోషణ ఇవ్వలేదు. కానీ, ఆమె జుట్టు మాత్రం చాంతాండత పొడవు పెరిగిపోయింది.

Woman Long uncombed hair resembles a cobra, Visuals leave Netizens stunned ram
Author
First Published Sep 29, 2023, 10:26 AM IST

మహిళలకు అందాన్ని ఇచ్చేది జుట్టు. ప్రతి ఒక్క అమ్మాయి, తమ కురులను అందంగా కనిపించాలని కోరుకుంటారు. ఇక, ఆ జట్టు కోసం  చాలా ఖర్చు చేస్తారు. ఖరీదైన నూనెలు, షాంపూలు వాడతారు. అయితే, ఎంత ఖరీదైనవి వాడినా చాలా మంది జుట్టు రాలిపోతూ ఉంటుంది. పెద్దగా కోరుకున్నంత పొడవు కూడా పెరగదు. కానీ, ఓ మహిళ తన జుట్టుకు కనీసం పోషణ ఇవ్వలేదు. కానీ, ఆమె జుట్టు మాత్రం చాంతాండత పొడవు పెరిగిపోయింది.

అయితే, ఆమె ఆ జుట్టును సరిగా పట్టించుకోకపోవడం వల్ల, అది  ఉండలాగా తయారైంది. అసలు అది జట్టు కాదు, మర్రి చెట్టు ఊడల్లా ఉన్నాయి. కాగా, ఆమెను కొందరు వీడియో తీసి, సోషలో మీడియాలో షేర్ చేయగా, అది వైరల్ గా మారింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

 

ఉత్తరప్రేదేశ్ రాష్ట్రం బృందావన్ ధామ్ లో ఈ మహిళ కనిపించింది. ఆమె కురులు చాలా పొడవుగా, పాము తలను తలపించేలా కనిపించడం విశేషం.  సదరు మహిళ కృష్ణుడి సేవలో మునిగిపోయింది. దీంతో, ఆమె జుట్టును పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా ఆ జుట్టు అలా నిర్జీవంగా తయారైంది. కానీ, పొడవు మాత్రం చాలా పెరగడం విశేషం. కాగా, సదరు మహిళకు అక్కడకు వచ్చిన భక్తులు దానం చేస్తూ ఉంటారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios