మరో వ్యక్తి డబ్బుల కట్టతో కనపడగానే, ప్రియుడిని వదిలేసి అతని వద్దకు వెళ్లిపోయింది. అంతేకాదు అతని బైక్ కూడా ఎక్కి వెళ్లిపోతుంది. 

ఈరోజుల్లో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చాలా మంది చాలా చేస్తుంటారు. ముఖ్యంగా రీల్స్ చేసి, సోషల్ మీడియాలో చాలా మంది ఫేమస్ అవతున్నారు. కొందరు కొన్ని విన్యాసాలు చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తుంటే, తాజాగా ఓ జంట చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోంది.

వీడియోలొ ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ తో ఉంది. అతనేమో ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటాడు. అయితే ఆమె మాత్రం ఆ వెంటనే మరో వ్యక్తి డబ్బుల కట్టతో కనపడగానే, ప్రియుడిని వదిలేసి అతని వద్దకు వెళ్లిపోయింది. అంతేకాదు అతని బైక్ కూడా ఎక్కి వెళ్లిపోతుంది. అది చూసి ఆమె ప్రియుడు షాకైపోతాడు. ఆ వెంటనే సింబాలిక్‌గా బాధాకరమైన పాట ప్లే అవుతుంది. ఆ యువకుడు అదే ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ అలాగే చూస్తే ఉండిపోతాడు. ఈ వీడియో సరదా కోసం చిత్రీకరించినా.. అందరినీ తెగ ఆకట్టుకుంటోంది.

View post on Instagram

అయితే ఇది నిజంగా జరిగిన సంఘటన కాదు. సరదాగా తీసింది కావడం విశేషం. అయినా, ఇది నెట్టింట వైరల్ గా మారింది. తెగ వ్యూస్ వస్తున్నాయి. ఈ కాలం అమ్మాయిలు ఇలానే ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టడం విశేషం. మీరు కూడా ఈ వీడియో చూసేయండి.