భర్తను చంపి శవాన్ని అండర్ గ్రౌండ్ లో దాచి, పరార్

Woman kills spouse, dumps body in underground barn
Highlights

భర్తను చంపిందనే అనుమానంతో బెంగళూరు రూరల్ జిల్లా నీలమంగళ పోలీసులు 30 ఏళ్ల మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

బెంగళూరు: భర్తను చంపిందనే అనుమానంతో బెంగళూరు రూరల్ జిల్లా నీలమంగళ పోలీసులు 30 ఏళ్ల మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బెంగళూరు రూరల్ జిల్లా నీలమంగళ తాలూకా వజరహళ్లిలో ఓ మహిళ తన భార్యను చంపి శవాన్ని అండర్ గ్రౌండ్ లోని ధాన్యం కొట్టులో దాచిందనే ఆరోపణలు ఎదుర్కుంటోంది. 

సుతారి అయిన ఈరలింగప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కల్యాదుర్గకు చెందినవాడు. అతను పని వెతుక్కుంటూ భార్య ఈశ్వరమ్మ, సోదరిలతో లిసి మార్చిలో వజరహళ్లి వచ్చాడు. ఇద్దరు మహిళలు నిర్మాణ రంగంలో కూలీలుగా పనిచేస్తూ వస్తున్నారు.  

ఇంటిలో అండర్ గ్రౌండ్ నుంచి దుర్వాసన వస్తోందని ఈరలింగప్ప సోదరి ఇరుగుపొరుగువారికి మంగళవారం ఉదయం చెప్పింది. ధాన్యం కొట్టు చుట్టూ ఈగలు ముసురుకుని ఉన్నాయి. 

స్థానికులు ధాన్యం కొట్టు చెక్క తలుపు తీసి చూసేసరికి కుళ్లిపోయిన స్థితిలో ఈరలింగప్ప శవం కనిపించింది. ఈరలింగప్ప, అతని భార్య మూడు రోజులుగా కనిపించలేదని ఈరలింగప్ప సోదరి చెప్పింది. వారు పని మీద ఇంటికి వెళ్లి ఉంటారని భావించానని చెప్పింది. 

ఈశ్వరమ్మ పరారీలో ఉంది. ఈమె కోసం మహిళా సబ్ ఇన్ స్పెక్టర్ నేతృత్వంలోని పోలీసు బృందం కల్యాణదుర్గకు వెళ్లింది. 

loader