మొదట ఓ వ్యక్తిని పెళ్లాడింది. అతనితో కొన్నాళ్లు కాపురం చేసి ఓ బిడ్డను కూడా కన్న తర్వాత.. ఆ భర్తతో  మనస్పర్థలు వచ్చాయి. దీంతో అతనిని వదిలేసింది. చాలా కాలం తర్వాత మరో వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ భర్తతో కూడా డబ్బుల విషయంలో గొడవలు వచ్చాయి. అంతే.. తన సోదరుడితో కలిసి కిడ్నాప్ చేసి నరకం చూపించి మరీ హత్య చేసింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే....బెంగళూరుకు చెందిన రశ్మి కి పన్నెండేళ్ల క్రితం ఓ వ్యక్తితో పెళ్లైంది. ఆమెకు పదకొండు సంవత్సరాల వయసుగల కొడుకు కూడా ఉన్నాడు. కాగా..ఆ భర్తతో విడిపోయిన కొడుకుతో జీవించేది. ఆమె ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.

కాగా..ఆమె నాలుగేళ్ల క్రితం బ్యాంక్ ఉద్యోగి సుబ్రహ్మణ్యంని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే నగదు విషయంలో భార్య, భర్తల మధ్య గొడవ నెలకొంది. ఈనేపథ్యంలో పథకం ప్రకారం భర్తను చంపాలని అనుకుంది. ముందుగా తన సోదరుడు, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి భర్తను కిడ్నాప్ చేసింది.

Also Read ఉరి ఇలా వేసుకోవాలని భార్యకి చెబుతూ... నిజంగానే...

వారం రోజులపాటు ఓ గదిలో బంధించి.. దారుణంగా హింసించింది. గోళ్లను పీకి.. ఇనుప రాడ్లతో కొట్టి అతి కిరాతకంగా హింసించింది. ఆ తర్వాత అతనిని అతని ఇంటివద్ద పడేసి పరారయ్యారు. చుట్టుపక్కల వారు గ్రహించి కొళ్ళెగాలలో ఉన్న ప్రవేట్‌ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స కొసం మైసూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 

అక్కడ చికిత్స పొందుతూ సుబ్రమణ్యం మంగళవారం చనిపోయాడు. కొళ్ళెగాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు సుబ్రమణ్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రశ్మిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. సుబ్రమణ్యం బెట్టింగ్‌ కోసం తన డబ్బులు మొత్తం తీసుకొని పోగొట్టాడని, వాటి కోసమే ఈ రగడ జరిగిందని రశ్మి పోలీసులకు తెలిపింది. కేసు దర్యాప్తులో ఉంది. రశ్మిని పోలీసులు అరెస్ట్ చేయగా.. ఆమె సోదరుడు, మరో ఇద్దరు స్నేహితులు మాత్రం పరారీలో ఉన్నారు.