సరదాకి చేసిన ఓ పని అతని ప్రాణం తీసింది. ఉరి ఇలా వేసుకోవాలి అంటూ భార్యకు చూపిస్తూ... నిజంగానే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని మదురై జిల్లా చోళైయళగుపురానికి చెందిన మహ్మద్ అలీ(22) కి రెండు నెలల క్రితమే వివాహమైంది.  అతను  ఇటీవల ఇంట్లో భార్యతో ఏకాంతంగా గడుపుతున్నాడు.

ఆ సమయంలో పలు విషయాలు మాట్లాడుకున్న భార్యభర్తలు.. ఉరి కాన్సెప్ట్ గురించి మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో మహ్మద్ అలీ.. భార్యకు ఉరి ఎలా వేసుకోవాలో చెప్పాడు. అందులో భాగంగానే తాడుతో ఉరివేసుకోవడం గురించి చూపిస్తుండగా నిజంగానే ఉరి బిగుసుకుంది.

Also Read ఒడిశాలో ఘోర ప్రమాదం: ఏడుగురు మృతి, 40 మందికి గాయాలు...

ఆ సమయంలో అతను నిలబడిన కుర్చీ జారి కిందపడింది. గొంతుకు ఉన్న తాడు బిగుసుకుంది. దిగ్బ్రాంతికి గురైన భార్యవెంటనే గట్టిగా కేకలు వేసింది. వెంటనే స్థానికలుు వచ్చి అలీని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే... ఈ ఘటనపై అలీ భార్యపై కూడా కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.