కేవలం రూ.20 కోసం ఓ యువతి.. అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాలను బలికొన్నది. ఈ దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లా జాగనూర గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

జాగనూర గ్రామానికి చెందిన దివ్య(4) అనే చిన్నారి బుధవారం బిస్కేట్లు కొనుక్కునేందుకు డబ్బు తీసుకొని గ్రామంలో ఉన్న ఓ దుకాణం వద్దకు వచ్చింది. అయితే.. చిన్నారి దుకాణానికి వెళ్లడాన్ని అదే గ్రామానికి చెందిన పూజ అనే యువతి చూసింది.

చిన్నారి చేతిలోని రూ.20లను కాజేయాలని చూసింది. వెంటనే ఎవరూ చూడకుండా ఆ చిన్నారి చేతిలోని రూ.20 లాక్కుంది. అయితే.. తన డబ్బుల కోసం ఆ చిన్నారి దివ్య గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది.

పాప ఏడుపు విని చుట్టుపక్కల వారు ఎవరైనా వస్తారేమోఅనే భయంతో పూజ... దివ్యను సమీపంలోని బావిలోకి తోసేసింది. కేవలం రూ.20 కోసం చిన్నారిని అతి క్రూరంగా చంపేసింది. కాగా.. దివ్య తల్లిదండ్రులు వచ్చి చూసే సరికి ఆ చిన్నారి తుది శ్వాస విడిచింది. దివ్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలి అరెస్టు చేశారు.